ఐనట్టాయఁ గాని ఆలనైన నీ (నా?)కుఁ బోదు
(॥పల్లవి॥)
ఐనట్టాయఁ గాని ఆలనైన నీ (నా?)కుఁ బోదు
దానకేమి నన్నుఁజూచి దయపుట్టీ నీకును
(॥ఐన॥)
వేడుకై వున్నదా నీకు విన్నవించేనామాట
వీడనాడఁ జాలక వినేవు గాక
యీడనే పాదాలు గుద్దే దితివా నీకేమైనా
వోడక యేటిఁకో వోర్చుకున్నాఁడవు గాక
(॥ఐన॥)
నీటున నేఁ జెనకఁగా నీ చిత్తము వచ్చున్నదా
నాటకాలకు నూరికే నవ్వేవుగాక
పాటలు నేఁ బాడఁగాను భావించి నీవు చొక్కేవా
మేటివై కార్యవశాన మెచ్చేవుగాక
(॥ఐన॥)
అట్టే నా కాఁగిటిపై నాస నీకున్నదా
గుట్టు మానఁజాలక కూడేవుగాక
నెట్టన శ్రీవేంకటేశ నే నలవేల్ మంగను
చుట్టమవై మన్నించ జూచితివిగాక
(||pallavi||)
ainaṭṭāyam̐ gāni ālanaina nī (nā?)kum̐ bodu
dānagemi nannum̐jūsi dayabuṭṭī nīgunu
(||aina||)
veḍugai vunnadā nīgu vinnaviṁchenāmāḍa
vīḍanāḍam̐ jālaga vinevu gāga
yīḍane pādālu gudde didivā nīgemainā
voḍaga yeḍim̐ko vorsugunnām̐ḍavu gāga
(||aina||)
nīḍuna nem̐ jĕnagam̐gā nī sittamu vachchunnadā
nāḍagālagu nūrige navvevugāga
pāḍalu nem̐ bāḍam̐gānu bhāviṁchi nīvu sŏkkevā
meḍivai kāryavaśhāna mĕchchevugāga
(||aina||)
aṭṭe nā kām̐giḍibai nāsa nīgunnadā
guṭṭu mānam̐jālaga kūḍevugāga
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nalavel maṁganu
suṭṭamavai manniṁcha jūsidivigāga