ఐనపని యాయఁగాక అవుఁగాము లిఁకనేలె
(॥పల్లవి॥)
ఐనపని యాయఁగాక అవుఁగాము లిఁకనేలె
సేనా సేనలు గంటి చెప్పనేలే మాఁట
(॥ఐన॥)
కన్నులకెం పది దేరె కాఁకలనే తెల్లవారె
యెన్నఁగ తనవో నింకా నేలే మాఁట
సన్నపుఁజెమట రేఁగె జాజుఁబులకలే మూఁగె
యిన్నిటికి నోచితి నే నిఁకనేలే మాఁట
(॥ఐన॥)
మోమున కళలు మించె మోవికెంపు లంగమించె
యేమిటికి తనతో నింకేలే మాఁట
కామునేటు మేనఁ దేలె గందపుబేంట్లు రాలె
యీమరఁగు వింటిఁ గంటి నిఁకనేలే మాఁట
(॥ఐన॥)
కడసారెఁ గాఁగిలించె కై వశమై నాకుఁ బొంచె
యెడప తగవు దేరె నేలే మాఁట
అడరి శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
యెడమిచ్చీ సంతసము లిఁకనేలే మాఁట
(||pallavi||)
ainabani yāyam̐gāga avum̐gāmu lim̐kanelĕ
senā senalu gaṁṭi sĕppanele mām̐ṭa
(||aina||)
kannulagĕṁ padi derĕ kām̐kalane tĕllavārĕ
yĕnnam̐ga tanavo niṁkā nele mām̐ṭa
sannabum̐jĕmaḍa rem̐gĕ jājum̐bulagale mūm̐gĕ
yinniḍigi nosidi ne nim̐kanele mām̐ṭa
(||aina||)
momuna kaḽalu miṁchĕ movigĕṁpu laṁgamiṁchĕ
yemiḍigi tanado niṁkele mām̐ṭa
kāmuneḍu menam̐ delĕ gaṁdabubeṁṭlu rālĕ
yīmaram̐gu viṁṭim̐ gaṁṭi nim̐kanele mām̐ṭa
(||aina||)
kaḍasārĕm̐ gām̐giliṁchĕ kai vaśhamai nāgum̐ bŏṁchĕ
yĕḍaba tagavu derĕ nele mām̐ṭa
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
yĕḍamichchī saṁtasamu lim̐kanele mām̐ṭa