Ainabani kimkanela anumaanamu

ఐనపని కిఁకనేల అనుమానము
Language

(॥పల్లవి॥)
ఐనపని కిఁకనేల అనుమానము
కానిమ్మని లోనుగాక కట్టుకునేదేమీ

(॥ఐన॥)
మొగముచూచినదాన మొక్కవద్దా నీకు నేను
యెగసక్కెమాడఁగాను యేమాయను
నగినదాన నీతో నంటున మెప్పించవద్దా
జగడమడిచి నిన్ను సాదించేదేమి

(॥ఐన॥)
చేరఁగవచ్చినదాన సేవలు సేయఁగవద్దా
యీరసాన జంకించఁగ నేమాయను
పేరఁబిలిచినదాన ప్రియములు చెప్పవద్దా
దూరి నిన్నుఁ దిట్టుఁగాను దొరతనమేమి

(॥ఐన॥)
సిగ్గులువడినదాన చెప్పినట్లు సేయవద్దా
యెగ్గులెంచి పెనఁగఁగా నేమాయను
వెగ్గళించి నన్నిదె శ్రీవేంకటేశ కూడితివి
బగ్గన నిన్నఁగాదనేపను లిఁకనేమి

(||pallavi||)
ainabani kim̐kanela anumānamu
kānimmani lonugāga kaṭṭugunedemī

(||aina||)
mŏgamusūsinadāna mŏkkavaddā nīgu nenu
yĕgasakkĕmāḍam̐gānu yemāyanu
naginadāna nīdo naṁṭuna mĕppiṁchavaddā
jagaḍamaḍisi ninnu sādiṁchedemi

(||aina||)
seram̐gavachchinadāna sevalu seyam̐gavaddā
yīrasāna jaṁkiṁcham̐ga nemāyanu
peram̐bilisinadāna priyamulu sĕppavaddā
dūri ninnum̐ diṭṭum̐gānu dŏradanamemi

(||aina||)
sigguluvaḍinadāna sĕppinaṭlu seyavaddā
yĕggulĕṁchi pĕnam̐gam̐gā nemāyanu
vĕggaḽiṁchi nannidĕ śhrīveṁkaḍeśha kūḍidivi
baggana ninnam̐gādanebanu lim̐kanemi