Ainabani kimkanela amta gorabu sesevu

ఐనపని కిఁకనేల అంత గొరబు చేసేవు
Language

(॥పల్లవి॥)
ఐనపని కిఁకనేల అంత గొరబు చేసేవు
దీని నేమివచ్చె నీకు తెలుసుకోరాదా

(॥॥)
యిచ్చకమాడఁగఁ బతి నేల గద్దించి వేసేవు
అచ్చపు నీలోనికోప మాఁపఁగ రాదా
పచ్చి దేరిన పనులు బయలు సేయఁగ నేల
వచ్చెఁగా యింటికతఁడు వడిఁ గూడరాదా

(॥॥)
ఇప్పుడిట్టే నవ్వేవాని నేల వొట్టులువెట్టేవు
తప్పు లెంచకిట్టే దయఁ దలచరాదా
చెప్పెను తనచేఁతలు చిడుముడి పడనేల
కప్పెఁగా పచ్చడమిఁకఁ గానిమ్మనరాదా

(॥॥)
చెక్కునొక్కి కూడేచోట సిగ్గులేల పెంచేవు
వొక్కటైతివి చన్నుల నొరయరాదా
నిక్కి శ్రీవేంకటేశుఁడు నిన్ను నేలె మరఁగేల
తొక్కెఁగా పాదమిట్టే సంతోసించఁగరాదా

(||pallavi||)
ainabani kim̐kanela aṁta gŏrabu sesevu
dīni nemivachchĕ nīgu tĕlusugorādā

(||||)
yichchagamāḍam̐gam̐ badi nela gaddiṁchi vesevu
achchabu nīlonigoba mām̐pam̐ga rādā
pachchi derina panulu bayalu seyam̐ga nela
vachchĕm̐gā yiṁṭigadam̐ḍu vaḍim̐ gūḍarādā

(||||)
ippuḍiṭṭe navvevāni nela vŏṭṭuluvĕṭṭevu
tappu lĕṁchagiṭṭe dayam̐ dalasarādā
sĕppĕnu tanasem̐talu siḍumuḍi paḍanela
kappĕm̐gā pachchaḍamim̐kam̐ gānimmanarādā

(||||)
sĕkkunŏkki kūḍesoḍa siggulela pĕṁchevu
vŏkkaḍaidivi sannula nŏrayarādā
nikki śhrīveṁkaḍeśhum̐ḍu ninnu nelĕ maram̐gela
tŏkkĕm̐gā pādamiṭṭe saṁtosiṁcham̐garādā