ఐనాఁ గాని నే నోపినంత నిన్నుఁ బొగడేను
(॥పల్లవి॥)
ఐనాఁ గాని నే నోపినంత నిన్నుఁ బొగడేను
వీనుల నీ సంకీర్తన వినవే నారాయణా
(॥ఐనా॥)
ముప్పదిమూఁడు గోటులై ముంచిన సురల నోళ్లు
విప్పిన శేషుని రెండువేల జిహ్వలు
తప్పులేని యనంతవేదంబుల శబ్దములు
వొప్పుగా నిన్ను నుతించ నోపవు నే నెంతా
(॥ఐనా॥)
రమణ నష్టాదశ పురాణములలో వాక్యములు
తిమురుచుండే సనకాదిమునుల యుక్తులు
అమరిన వ్యాస వాల్మికాది కవివుపమలు
నెమకి నిన్ను నుతించనేరవు నే నెంతా
(॥ఐనా॥)
మట్టులేని సప్త కోటిమంత్రముల యర్థములు
అట్టె యాఁబదియారు అక్షరాల గుణితాలు
నెట్టన శ్రీవేంకటేశ నీ గుణ కథనాలు
జట్టిగా నిన్ను నుతించఁ జాలవు నే నెంతా
(||pallavi||)
ainām̐ gāni ne nobinaṁta ninnum̐ bŏgaḍenu
vīnula nī saṁkīrdana vinave nārāyaṇā
(||ainā||)
muppadimūm̐ḍu goḍulai muṁchina surala noḽlu
vippina śheṣhuni rĕṁḍuvela jihvalu
tappuleni yanaṁtavedaṁbula śhabdamulu
vŏppugā ninnu nudiṁcha nobavu ne nĕṁtā
(||ainā||)
ramaṇa naṣhṭādaśha purāṇamulalo vākyamulu
timurusuṁḍe sanagādimunula yuktulu
amarina vyāsa vālmigādi kavivubamalu
nĕmagi ninnu nudiṁchaneravu ne nĕṁtā
(||ainā||)
maṭṭuleni sapta koḍimaṁtramula yardhamulu
aṭṭĕ yām̐badiyāru akṣharāla guṇidālu
nĕṭṭana śhrīveṁkaḍeśha nī guṇa kathanālu
jaṭṭigā ninnu nudiṁcham̐ jālavu ne nĕṁtā