ఐతివే యేలికెసాని వందరికిని
(॥పల్లవి॥)
ఐతివే యేలికెసాని వందరికిని
నీతితో సవతులెల్ల నీకు లోనే యిఁకను
(॥ఐతివే॥)
ఆరసి నీ కాతఁడు అరవడమచ్చునే
పేరురాన నేపొద్దూఁ బెట్టుకున్నాఁడు
సారెకు నీవు మంచి సకినాన వచ్చితివే
యీరాని చనవులెల్లా నిచ్చినాఁడు నీకు
(॥ఐతివే॥)
పొందుల నీకాతనికి పొంతనాలు గూడునే
మందలించి నీవాడినమాట దోయఁడు
యెందును నీమొకమాయ మందు యెటువంటిదే
కందువ నీ మోవికే కాచుకున్నాఁ డిపుడు
(॥ఐతివే॥)
చెలఁగి మంచివేళనే సేస నీవు వెట్టితివే
కలసి పాయఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
అలరి మమ్మేలెనాతఁ డప్పణ నీవిచ్చితివే
వలపించ నేరుతువే వసమాయ నతఁడు
(||pallavi||)
aidive yeligĕsāni vaṁdarigini
nīdido savadulĕlla nīgu lone yim̐kanu
(||aidive||)
ārasi nī kādam̐ḍu aravaḍamachchune
perurāna nebŏddūm̐ bĕṭṭugunnām̐ḍu
sārĕgu nīvu maṁchi sagināna vachchidive
yīrāni sanavulĕllā nichchinām̐ḍu nīgu
(||aidive||)
pŏṁdula nīgādanigi pŏṁtanālu gūḍune
maṁdaliṁchi nīvāḍinamāḍa doyam̐ḍu
yĕṁdunu nīmŏgamāya maṁdu yĕḍuvaṁṭide
kaṁduva nī movige kāsugunnām̐ ḍibuḍu
(||aidive||)
sĕlam̐gi maṁchiveḽane sesa nīvu vĕṭṭidive
kalasi pāyam̐ḍu śhrīveṁkaḍeśhvarum̐ḍu
alari mammelĕnādam̐ ḍappaṇa nīvichchidive
valabiṁcha neruduve vasamāya nadam̐ḍu