ఐతేనేమి దోసము అపరాధమేమి నీకు
(॥పల్లవి॥)
ఐతేనేమి దోసము అపరాధమేమి నీకు
కాతరము గలిగిన ఘనుఁడవు నీవు
(॥ఐతే॥)
పుక్కిటఁ బోసిన యట్టిబుద్దులు నీకవి సుమ్మీ
తక్కక ఆకెవెట్టిన తమ్ములము
అక్కడ నీకు నేను ఆకుమడిచియ్యలేదు
యెక్కడనుండి వచ్చెనో యేల లేదనేవు
(॥ఐతే॥)
వుంకువిచ్చి కైకొన్నవొగి సంచకారుసుమ్మీ
అంకెల నీకొనవేలి ఆవుంగరము
పొంకాన నే మెన్నఁడు పూఁచి యిచ్చినది లేదు
లంకెఁ బెట్టుకొంటివి పల్లదా లేలాడేవు
(॥ఐతే॥)
వుమ్మడి నాపె వెట్టిన వొరపు వలపు సుమ్మీ
కమ్మి కాఁగిటనంటిన గందము నీకు
నెమ్మది శ్రీ వేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
అమ్మకోఁ నే నెఱఁగని వానలేల పట్టేవు
(||pallavi||)
aidenemi dosamu abarādhamemi nīgu
kādaramu galigina ghanum̐ḍavu nīvu
(||aide||)
pukkiḍam̐ bosina yaṭṭibuddulu nīgavi summī
takkaga āgĕvĕṭṭina tammulamu
akkaḍa nīgu nenu āgumaḍisiyyaledu
yĕkkaḍanuṁḍi vachchĕno yela ledanevu
(||aide||)
vuṁkuvichchi kaigŏnnavŏgi saṁchagārusummī
aṁkĕla nīgŏnaveli āvuṁgaramu
pŏṁkāna ne mĕnnam̐ḍu pūm̐si yichchinadi ledu
laṁkĕm̐ bĕṭṭugŏṁṭivi palladā lelāḍevu
(||aide||)
vummaḍi nābĕ vĕṭṭina vŏrabu valabu summī
kammi kām̐giḍanaṁṭina gaṁdamu nīgu
nĕmmadi śhrī veṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
ammagom̐ ne nĕṟam̐gani vānalela paṭṭevu