అహోబలేశ్వరునకు నాదిమూర్తికి
(॥పల్లవి॥)
అహోబలేశ్వరునకు నాదిమూర్తికి
విహారమే పంతము వీరసింహమునకు
(॥అహో॥)
చుక్కలు మొలపూసలు సూర్యచంద్రులు కన్నులు
దిక్కులు చేతు లెండలు దివ్యాయుధాలు
మిక్కుటపు వేదములు మించుఁగొస వెంట్రుకలు
రక్కసులఁ జెండే విదారణసింహమునకు
(॥అహో॥)
శై లములే పాదములు జానువులే లోకములు
కాలచక్రమే నోరు గ్రహాలు పండ్లు
చాలుకొన్న మేఘములు సకలదివ్యాంబరాలు
పాలించే ప్రతాపపుసింహమునకు
(॥అహో॥)
అంతరిక్షమే నడుము అట్టె భూమియే పిరుఁదు
వంతఁ గృపారసము వార్ధులెల్లాను
యింతటా శ్రీవేంకటాద్రి యిరవు మహాగుహ
రంతు లురుములు ఘోరరౌద్రసింహమునకు
(||pallavi||)
ahobaleśhvarunagu nādimūrdigi
vihārame paṁtamu vīrasiṁhamunagu
(||aho||)
sukkalu mŏlabūsalu sūryasaṁdrulu kannulu
dikkulu sedu lĕṁḍalu divyāyudhālu
mikkuḍabu vedamulu miṁchum̐gŏsa vĕṁṭrugalu
rakkasulam̐ jĕṁḍe vidāraṇasiṁhamunagu
(||aho||)
śhai lamule pādamulu jānuvule logamulu
kālasakrame noru grahālu paṁḍlu
sālugŏnna meghamulu sagaladivyāṁbarālu
pāliṁche pradābabusiṁhamunagu
(||aho||)
aṁtarikṣhame naḍumu aṭṭĕ bhūmiye pirum̐du
vaṁtam̐ gṛpārasamu vārdhulĕllānu
yiṁtaḍā śhrīveṁkaḍādri yiravu mahāguha
raṁtu lurumulu ghoraraudrasiṁhamunagu