అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు
(॥పల్లవి॥)
అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు
మహామహిమలను మలసీ వాఁడే
(॥అహో॥)
కదలుఁ గన్నులును కరాళవదనము
గుదిగొను భయదపుఁ గోరలును
అదరు మీసములు నలరఁగ నవ్వుచు
వుదుటు తోడఁ గొలువున్నాఁడు వాఁడె
(॥అహో॥)
అతిసిత నఖములు ననంత భుజములు
వితతపరాక్రమ వేషమును
అతులదీర్ఘజిహ్వయుఁ గడు మెరయఁగ
మితిలేని కరుణ మెరసీ వాఁడే
(॥అహో॥)
సందడి సొమ్ములు శంఖచక్రములు
పొందుగ దివిజులు పొగడగను
యిందిరఁ దొడపై నిడి శ్రీవేంకట-
మందు నిందు గడుఁ నలరీ వాడే
(||pallavi||)
ahobaleśhvarum̐ ḍariguladamanum̐ḍu
mahāmahimalanu malasī vām̐ḍe
(||aho||)
kadalum̐ gannulunu karāḽavadanamu
gudigŏnu bhayadabum̐ goralunu
adaru mīsamulu nalaram̐ga navvusu
vuduḍu toḍam̐ gŏluvunnām̐ḍu vām̐ḍĕ
(||aho||)
adisida nakhamulu nanaṁta bhujamulu
vidadabarākrama veṣhamunu
aduladīrghajihvayum̐ gaḍu mĕrayam̐ga
midileni karuṇa mĕrasī vām̐ḍe
(||aho||)
saṁdaḍi sŏmmulu śhaṁkhasakramulu
pŏṁduga divijulu pŏgaḍaganu
yiṁdiram̐ dŏḍabai niḍi śhrīveṁkaḍa-
maṁdu niṁdu gaḍum̐ nalarī vāḍe