Agadela sesevu aage nimta

అగడేల సేసేవు ఆకె నింత
Language

(॥పల్లవి॥)
అగడేల సేసేవు ఆకె నింత
తగిలి పొందులు సేసి దయఁ జూడరాదా

(॥॥)
చన్నులపై ననుఁ గొంగు జాఱీ నది నెఱుఁ గదు
నిన్నుఁ జూచే పరాకున నెలఁతా
విన్నపము సేసీఁ గొప్పు వీడినది నెఱుఁగదు
కన్నెను లాలన సేసి కౌఁగిలించరాదా

(॥॥)
చెక్కుమీఁది చెమటలు చించేది నెఱుఁగదు
వెక్కసమై నీకు మొక్కే వేడుకలను
అక్కరతోఁ దనమేని అలపూ నెఱుఁగదు
మక్కువ నీపె నింతట మన్నించరాదా

(॥॥)
కందువతోఁ గంకణాలు గల్లురనే దెఱుఁగదు
అంది నిన్ను రతిఁగూడే యడియాసల
అందపు శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
చెందీ నిన్నీజవరాలు చిత్తగించరాదా

(||pallavi||)
agaḍela sesevu āgĕ niṁta
tagili pŏṁdulu sesi dayam̐ jūḍarādā

(||||)
sannulabai nanum̐ gŏṁgu jāṟī nadi nĕṟum̐ gadu
ninnum̐ jūse parāguna nĕlam̐tā
vinnabamu sesīm̐ gŏppu vīḍinadi nĕṟum̐gadu
kannĕnu lālana sesi kaum̐giliṁcharādā

(||||)
sĕkkumīm̐di sĕmaḍalu siṁchedi nĕṟum̐gadu
vĕkkasamai nīgu mŏkke veḍugalanu
akkaradom̐ danameni alabū nĕṟum̐gadu
makkuva nībĕ niṁtaḍa manniṁcharādā

(||||)
kaṁduvadom̐ gaṁkaṇālu gallurane dĕṟum̐gadu
aṁdi ninnu radim̐gūḍe yaḍiyāsala
aṁdabu śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ
sĕṁdī ninnījavarālu sittagiṁcharādā