Agabadidimi neegu naasa laasalaa

అగపడితిమి నీకు నాస లాసలా
Language

(॥పల్లవి॥)
అగపడితిమి నీకు నాస లాసలా
నగవులాయఁ బనులు నవ్వవయ్యా

(॥అగ॥)
అట్టె నీమీఁద నానలెల్లాఁ బెట్టఁగాను
బట్టబయలు వచ్చితిఁ బని యేమయ్యా
రట్టు సేసితివి తొల్లే యిట్టె కడు వలపించి
చిట్టకమేమి సేసేవు సేయవయ్యా

(॥అగ॥)
పైకొని నా కొంగు వట్టి బలుములు సేయఁగాను
అకడిమోమీకడైతి నానతీవయ్యా
చీకాకు సేసితివి సేస తురుముపైఁ బెట్టి
చేకొంటివి నీ విచ్చలఁ జెనకవయ్యా

(॥అగ॥)
కందువకుఁ దీసి నన్నుఁ గాఁగిలించుకొనఁగాను
యిందుకే నిన్ను గూడితి నేమనేవయ్యా
అందపు శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
చెందితి నాపై దయ సేయవయ్యా

(||pallavi||)
agabaḍidimi nīgu nāsa lāsalā
nagavulāyam̐ banulu navvavayyā

(||aga||)
aṭṭĕ nīmīm̐da nānalĕllām̐ bĕṭṭam̐gānu
baṭṭabayalu vachchidim̐ bani yemayyā
raṭṭu sesidivi tŏlle yiṭṭĕ kaḍu valabiṁchi
siṭṭagamemi sesevu seyavayyā

(||aga||)
paigŏni nā kŏṁgu vaṭṭi balumulu seyam̐gānu
agaḍimomīgaḍaidi nānadīvayyā
sīgāgu sesidivi sesa turumubaim̐ bĕṭṭi
segŏṁṭivi nī vichchalam̐ jĕnagavayyā

(||aga||)
kaṁduvagum̐ dīsi nannum̐ gām̐giliṁchugŏnam̐gānu
yiṁduge ninnu gūḍidi nemanevayyā
aṁdabu śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
sĕṁdidi nābai daya seyavayyā