(॥పల్లవి॥)
అటువంటివానినా అలయించేవు
సటలు నీ కాతఁడు చవిచూపఁజాలఁడే
(॥అటు॥)
మొక్కలపుమాటల మొనగోరినాటుల
తక్కులఁబెట్టేవేల తగ దాతని
చిక్కనినవ్వులు నవ్వె సిగ్గులెల్లాఁ బెడఁబాపె
వెక్కసానఁ బతి నీపై వింత సేయఁజాలఁడే
(॥అటు॥)
బొమ్మముడి జంకెలను బూటకపులంకెలను
చిమ్మనేల కోపమెల్లఁ జెల్ల దాతని
సమ్మతించ నిన్నుఁ జేసె చనువులెల్లాఁ జెల్లించె
కమ్మని రమణుఁడు గాతసేయఁ జాలఁడే
(॥అటు॥)
పూవుల చెందులవాట్ల బొంకులకన్నులగీఁట్ల
కావరించనేఁటికే కాఁగా దాతని
మోవియిచ్చి నిన్నుఁ గూడె మోహమెల్లా నిండఁజల్లె
శ్రీవేంకటేశుఁ డితఁడు చెనకఁగఁజాలఁడే
(||pallavi||)
aḍuvaṁṭivāninā alayiṁchevu
saḍalu nī kādam̐ḍu savisūbam̐jālam̐ḍe
(||aḍu||)
mŏkkalabumāḍala mŏnagorināḍula
takkulam̐bĕṭṭevela taga dādani
sikkaninavvulu navvĕ siggulĕllām̐ bĕḍam̐bābĕ
vĕkkasānam̐ badi nībai viṁta seyam̐jālam̐ḍe
(||aḍu||)
bŏmmamuḍi jaṁkĕlanu būḍagabulaṁkĕlanu
simmanela kobamĕllam̐ jĕlla dādani
sammadiṁcha ninnum̐ jesĕ sanuvulĕllām̐ jĕlliṁchĕ
kammani ramaṇum̐ḍu gādaseyam̐ jālam̐ḍe
(||aḍu||)
pūvula sĕṁdulavāṭla bŏṁkulagannulagīm̐ṭla
kāvariṁchanem̐ṭige kām̐gā dādani
moviyichchi ninnum̐ gūḍĕ mohamĕllā niṁḍam̐jallĕ
śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu sĕnagam̐gam̐jālam̐ḍe