అటువంటివాఁడు గాఁడు అతఁడు నీకుఁ దప్పఁడు
(॥పల్లవి॥)
అటువంటివాఁడు గాఁడు అతఁడు నీకుఁ దప్పఁడు
కిటుకులెల్లా మాని కేలెత్తి మొక్కవే
(॥అటు॥)
దప్పిదేరెమోముతోడ తమకాన నున్నాఁడు
కప్పుర మియ్యఁగదవే కలికీ
ఇప్పుడు వచ్చితి వాతఁ డిందాఁకాఁదా నొంటి నుండె
చిప్పిలుఁజెమట లార్చి సేదదేర్చవే
(॥అటు॥)
అసురుసురనుకొంటా ఆసలతో నున్నాఁడు
కొసరి విడెమియ్యవే కోమలీ
ముసుఁగు దీసితి విట్టె మోము గాన కాతఁ డుండె
వెస నీమోవి యిచ్చి వేడుకసేయవే
(॥అటు॥)
చిగురుఁదలపోఁతతో శ్రీవేంకటేశుఁ డున్నాఁడు
తగురతిఁ గూడవే తరుణీ
వొగి సేసవెట్టితివి వొలసి నిన్నాతఁడేలె
పొగడి కాఁగిటలోనే పొసఁగివుండవే
(||pallavi||)
aḍuvaṁṭivām̐ḍu gām̐ḍu adam̐ḍu nīgum̐ dappam̐ḍu
kiḍugulĕllā māni kelĕtti mŏkkave
(||aḍu||)
dappiderĕmomudoḍa tamagāna nunnām̐ḍu
kappura miyyam̐gadave kaligī
ippuḍu vachchidi vādam̐ ḍiṁdām̐kām̐dā nŏṁṭi nuṁḍĕ
sippilum̐jĕmaḍa lārsi sedadersave
(||aḍu||)
asurusuranugŏṁṭā āsalado nunnām̐ḍu
kŏsari viḍĕmiyyave komalī
musum̐gu dīsidi viṭṭĕ momu gāna kādam̐ ḍuṁḍĕ
vĕsa nīmovi yichchi veḍugaseyave
(||aḍu||)
sigurum̐dalabom̐tado śhrīveṁkaḍeśhum̐ ḍunnām̐ḍu
taguradim̐ gūḍave taruṇī
vŏgi sesavĕṭṭidivi vŏlasi ninnādam̐ḍelĕ
pŏgaḍi kām̐giḍalone pŏsam̐givuṁḍave