Aduvamtivaamdavaa addo neevu

అటువంటివాఁడవా అద్దో నీవు
Language

(॥పల్లవి॥)
అటువంటివాఁడవా అద్దో నీవు
నటన మొకమోటాలు నడపేవు గాకా

(॥అటు॥)
తలఁపులోపల నీకు తగులు గలిగితేను
అలరి రా కుండుదువా అక్కడ నీవు
చలముల నెవ్వతో జాగులఁ బెట్టుక నిన్ను
వెలి లోను మఱపించి వెఱ్ఱిఁ జేసెఁ గాకా

(॥అటు॥)
కడుఁ దమకము నీకుఁ గమ్మి పెరరేఁచితేను
అడరి నాతో మాట లాడ కుందువా
వడి నెవ్వతో నిన్ను వాకట్టు గట్టుక యింత
ముడి వెట్టి విడిచి తా మొప్పెఁ జేసెఁ గాకా

(॥అటు॥)
తటుకన నన్నుఁ గూడేదయ నీకు లే కుండితే
ఘటన నెదురుకొని కాఁగిలింతువా
యిటువలె శ్రీవెంకటేశ కడపలోన
సటల కెవ్వతో నిన్ను చండి సేసెఁ గాకా

(||pallavi||)
aḍuvaṁṭivām̐ḍavā addo nīvu
naḍana mŏgamoḍālu naḍabevu gāgā

(||aḍu||)
talam̐pulobala nīgu tagulu galigidenu
alari rā kuṁḍuduvā akkaḍa nīvu
salamula nĕvvado jāgulam̐ bĕṭṭuga ninnu
vĕli lonu maṟabiṁchi vĕṭrim̐ jesĕm̐ gāgā

(||aḍu||)
kaḍum̐ damagamu nīgum̐ gammi pĕrarem̐sidenu
aḍari nādo māḍa lāḍa kuṁduvā
vaḍi nĕvvado ninnu vāgaṭṭu gaṭṭuga yiṁta
muḍi vĕṭṭi viḍisi tā mŏppĕm̐ jesĕm̐ gāgā

(||aḍu||)
taḍugana nannum̐ gūḍedaya nīgu le kuṁḍide
ghaḍana nĕdurugŏni kām̐giliṁtuvā
yiḍuvalĕ śhrīvĕṁkaḍeśha kaḍabalona
saḍala kĕvvado ninnu saṁḍi sesĕm̐ gāgā