అటువంటివాఁడా ఆతఁడు మాయెడకు
(॥పల్లవి॥)
అటువంటివాఁడా ఆతఁడు మాయెడకు
ఘటన నిప్పుడే నన్నుఁ గరుణించ కుండునా
(॥॥)
వేల నంటి మా కెల్ల వేగిరించ వచ్చునా
యేలిన యాతని చిత్త మింతే కాక
తాలిమి నాతఁ డేఁమైనా దయలేనివాఁడా
వోలి నూర కేమిటికో వున్నాఁడు గాకా
(॥॥)
పిర రేఁచి యాతనినేఁ బిలిపించవచ్చునా
మరిగిన రమణుని మన్ననే కాక
సర వెరిఁగినయట్టి సరఁసుడు గాఁడా
వొరసి యేమి దలఁచి వున్నాఁడో కాకా
(॥॥)
పచ్చి సేసియాతని నే భ్రమయించ వచ్చునా
యెచ్చటా శ్రీ వేంకటేశు హితవే కాక
మెచ్చ నేరిచిన యట్టి మేలువాఁ డు గాఁడా
వొచ్చెము దీరుచఁ గాచుకున్నాఁడు గాకా.
(||pallavi||)
aḍuvaṁṭivām̐ḍā ādam̐ḍu māyĕḍagu
ghaḍana nippuḍe nannum̐ garuṇiṁcha kuṁḍunā
(||||)
vela naṁṭi mā kĕlla vegiriṁcha vachchunā
yelina yādani sitta miṁte kāga
tālimi nādam̐ ḍem̐mainā dayalenivām̐ḍā
voli nūra kemiḍigo vunnām̐ḍu gāgā
(||||)
pira rem̐si yādaninem̐ bilibiṁchavachchunā
marigina ramaṇuni mannane kāga
sara vĕrim̐ginayaṭṭi saram̐suḍu gām̐ḍā
vŏrasi yemi dalam̐si vunnām̐ḍo kāgā
(||||)
pachchi sesiyādani ne bhramayiṁcha vachchunā
yĕchchaḍā śhrī veṁkaḍeśhu hidave kāga
mĕchcha nerisina yaṭṭi meluvām̐ ḍu gām̐ḍā
vŏchchĕmu dīrusam̐ gāsugunnām̐ḍu gāgā.