అటువంటిది గలితే నానతీవయ్యా
(॥పల్లవి॥)
అటువంటిది గలితే నానతీవయ్యా
యెటువంటి మగవాడ వేమిచెప్పేవయ్యా
(॥అటు॥)
చనవుసేసుక నీతో సరసములాడితేను
కొనగోరుదాఁకెనంటా గుంపించేవు
వెనకటిచెలులెల్లా వినోదములాడేవేళ
మనసిజముద్రలకు మాన్యమిచ్చిరా
(॥అటు॥)
మచ్చికచేసుక నీతో మాటలు నేనాడితేను
యెచ్చుకుందులున్నవంటా యెగ్గుపట్టేవు
అచ్చమైనరతివేళ ఆడువారెల్లాఁ గూడి
పచ్చిమాటలాడుమని బాసయిచ్చిరా
(॥అటు॥)
కూరిమి సేసుక నిన్నుఁ గూడఁగా శ్రీవేంకటేశ
మేరలుమీరితినంటా మించివచ్చేవు
కోరిక కాఁగిట నీకు గోపసతులెల్లాను
మారుకొనమవి నీకు మన్ననిచ్చిరా
(||pallavi||)
aḍuvaṁṭidi galide nānadīvayyā
yĕḍuvaṁṭi magavāḍa vemisĕppevayyā
(||aḍu||)
sanavusesuga nīdo sarasamulāḍidenu
kŏnagorudām̐kĕnaṁṭā guṁpiṁchevu
vĕnagaḍisĕlulĕllā vinodamulāḍeveḽa
manasijamudralagu mānyamichchirā
(||aḍu||)
machchigasesuga nīdo māḍalu nenāḍidenu
yĕchchuguṁdulunnavaṁṭā yĕggubaṭṭevu
achchamainaradiveḽa āḍuvārĕllām̐ gūḍi
pachchimāḍalāḍumani bāsayichchirā
(||aḍu||)
kūrimi sesuga ninnum̐ gūḍam̐gā śhrīveṁkaḍeśha
meralumīridinaṁṭā miṁchivachchevu
koriga kām̐giḍa nīgu gobasadulĕllānu
mārugŏnamavi nīgu mannanichchirā