Aduvamti vidyalu nee yamdu vunnavi

అటువంటి విద్యలు నీ యందు వున్నవి
Language

(॥పల్లవి॥)
అటువంటి విద్యలు నీ యందు వున్నవి
నటన లెందూ నొల్లవు నాకే దక్కితివి

(॥అటు॥)
ముంచి యవ్వతెకైనాను మోహించిన మగవాఁడు
కొంచించు మాఁటలాడ కోమలులతో
వంచించక నమ్మికలు వడి నొసఁగినవాఁడు
అంచెల వట్టియాచారాలన్నియు నెరపును

(॥అటు॥)
ననిచి యెవ్వతెకైనా నమ్మిక లిచ్చినవాఁడు
యెనసి నవ్వఁ జాలఁడు యింతులతోడు
మనసిచ్చి యొక్కతెనే మరిగియుండినవాఁడు
చెనకిన లోనుగాక చెల్లించు నేమములు

(॥అటు॥)
వాడికె నెవ్వతెకైనా వసమై యుండినవాఁడు
చూడనోడు నూరకైనా సుదతులను
యీడ నిట్టె శ్రీవేంకటేశ నన్ను నేలితివి
యేడా నీవంటివాఁడు లేఁ డిచ్చక మిట్టుండును

(||pallavi||)
aḍuvaṁṭi vidyalu nī yaṁdu vunnavi
naḍana lĕṁdū nŏllavu nāge dakkidivi

(||aḍu||)
muṁchi yavvadĕgainānu mohiṁchina magavām̐ḍu
kŏṁchiṁchu mām̐ṭalāḍa komalulado
vaṁchiṁchaga nammigalu vaḍi nŏsam̐ginavām̐ḍu
aṁchĕla vaṭṭiyāsārālanniyu nĕrabunu

(||aḍu||)
nanisi yĕvvadĕgainā nammiga lichchinavām̐ḍu
yĕnasi navvam̐ jālam̐ḍu yiṁtuladoḍu
manasichchi yŏkkadĕne marigiyuṁḍinavām̐ḍu
sĕnagina lonugāga sĕlliṁchu nemamulu

(||aḍu||)
vāḍigĕ nĕvvadĕgainā vasamai yuṁḍinavām̐ḍu
sūḍanoḍu nūragainā sudadulanu
yīḍa niṭṭĕ śhrīveṁkaḍeśha nannu nelidivi
yeḍā nīvaṁṭivām̐ḍu lem̐ ḍichchaga miṭṭuṁḍunu