అటువంటి సతి నీకు నమరె నాయకుఁడ
(॥పల్లవి॥)
అటువంటి సతి నీకు నమరె నాయకుఁడ
తటుకన నీకె తగుఁ దగునయ్యా
(॥అటు॥)
చలముల నూరకసారెకు దూరక
మెలుపున నానలు మీరక
కిలఁ కిలఁ బతితో కెలయుచుఁ గేరక
తలఁపులో మెలఁగు తరుణివో జాణ
(॥అటు॥)
పగటులు చూపక పంతాన నేఁపక
మొగిఁ దప్పులు కడు మోపక
అగడుసేసి వెడయాసలు రేఁపక
నిగిడి రతిఁ గలయు నెలఁతవో జాణ
(॥అటు॥)
జాగులు సేయక జంటలు వాయక
వేగిరపడి వొల వేయక
యీగటి శ్రీవేంకటేశ మాఁట దోయక
బాగుగఁ గూడిన పడఁతివో జాణ
(||pallavi||)
aḍuvaṁṭi sadi nīgu namarĕ nāyagum̐ḍa
taḍugana nīgĕ tagum̐ dagunayyā
(||aḍu||)
salamula nūragasārĕgu dūraga
mĕlubuna nānalu mīraga
kilam̐ kilam̐ badido kĕlayusum̐ geraga
talam̐pulo mĕlam̐gu taruṇivo jāṇa
(||aḍu||)
pagaḍulu sūbaga paṁtāna nem̐paga
mŏgim̐ dappulu kaḍu mobaga
agaḍusesi vĕḍayāsalu rem̐paga
nigiḍi radim̐ galayu nĕlam̐tavo jāṇa
(||aḍu||)
jāgulu seyaga jaṁṭalu vāyaga
vegirabaḍi vŏla veyaga
yīgaḍi śhrīveṁkaḍeśha mām̐ṭa doyaga
bāgugam̐ gūḍina paḍam̐tivo jāṇa