అటువంటి నిన్నేమందు ఆపె నేమందు
(॥పల్లవి॥)
అటువంటి నిన్నేమందు ఆపె నేమందు
తటుకున మీ సిగ్గులు తడవ నేమున్నది
(॥అట॥)
శ్రీసతి కాఁగిటనుండి జిడ్డు గొల్లెతల నెల్ల
బాసలిచ్చి కాఁగిలించి పాలించితి
మోసపుచ్చి అందులోన మొఱఁగఁగఁ జోటులేదు
యీసరియాఁడు వారిలో నింతబండు గలదా
(॥అటు॥)
భూమిదేవిని వీపుఁన పూఁచి మోచి అచ్చరల
దోమటిఁ బదారువేల దొమ్మిఁ గూడితి
బూమెలు సేసి నీ కంతబొంక విందు యెడలేదు
బామినుల పొందికలు వచ్చి సేయఁ దగునా
(॥అటు॥)
శిరసుపై తులసిని చెక్కుక మరెఁదరైన
తరుణులఁ గూడితి నన్నుఁ దగఁ గూడితి
యిర వెఱిఁగుండఁగానే యింత భ్రమయించరాదు
నిరతి శ్రీవేంకటోశ నీకే తెలును
(||pallavi||)
aḍuvaṁṭi ninnemaṁdu ābĕ nemaṁdu
taḍuguna mī siggulu taḍava nemunnadi
(||aḍa||)
śhrīsadi kām̐giḍanuṁḍi jiḍḍu gŏllĕdala nĕlla
bāsalichchi kām̐giliṁchi pāliṁchidi
mosabuchchi aṁdulona mŏṟam̐gam̐gam̐ joḍuledu
yīsariyām̐ḍu vārilo niṁtabaṁḍu galadā
(||aḍu||)
bhūmidevini vībum̐na pūm̐si mosi achcharala
domaḍim̐ badāruvela dŏmmim̐ gūḍidi
būmĕlu sesi nī kaṁtabŏṁka viṁdu yĕḍaledu
bāminula pŏṁdigalu vachchi seyam̐ dagunā
(||aḍu||)
śhirasubai tulasini sĕkkuga marĕm̐daraina
taruṇulam̐ gūḍidi nannum̐ dagam̐ gūḍidi
yira vĕṟim̐guṁḍam̐gāne yiṁta bhramayiṁcharādu
niradi śhrīveṁkaḍośha nīge tĕlunu