అటువంటి కాంత యీ యలమేల్మంగా
(॥పల్లవి॥)
అటువంటి కాంత యీ యలమేల్మంగా
తటుకున సతులార తలఁచరే యీ మోహము
(॥అటువంటి॥)
సారెఁ జెలిచేఁ బతికి దూరి విన్నవింపించకా
మారుకొని పలుమారు మాట లాడక
యీరసపు సవతిపోలిక నీపై జూపక
నేరుతోపు నున్నాపెకు నెఱవేఱు మోహము
(॥అటువంటి॥)
అడఁకువ లేక యెందుకైనా అడ్డాలు రాక
అడుగఁగరానిసుద్దు లడుగక
కడుఁ బరాకైతేఁ బతికపటాలు దలఁచక
బడివాయకున్నాపెకు పాదుకొను మోహము
(॥అటువంటి॥)
తమకించి యతనిచిత్తము గలఁగించక
సమరతి నలసినఁ దమి మానక
అమర శ్రీవేంకటేశు నన్నిటాఁ జొక్కించి కూడి
తెమలకున్నాపెకు తిరమౌను మోహము
(||pallavi||)
aḍuvaṁṭi kāṁta yī yalamelmaṁgā
taḍuguna sadulāra talam̐sare yī mohamu
(||aḍuvaṁṭi||)
sārĕm̐ jĕlisem̐ badigi dūri vinnaviṁpiṁchagā
mārugŏni palumāru māḍa lāḍaga
yīrasabu savadiboliga nībai jūbaga
nerudobu nunnābĕgu nĕṟaveṟu mohamu
(||aḍuvaṁṭi||)
aḍam̐kuva lega yĕṁdugainā aḍḍālu rāga
aḍugam̐garānisuddu laḍugaga
kaḍum̐ barāgaidem̐ badigabaḍālu dalam̐saga
baḍivāyagunnābĕgu pādugŏnu mohamu
(||aḍuvaṁṭi||)
tamagiṁchi yadanisittamu galam̐giṁchaga
samaradi nalasinam̐ dami mānaga
amara śhrīveṁkaḍeśhu nanniḍām̐ jŏkkiṁchi kūḍi
tĕmalagunnābĕgu tiramaunu mohamu