అటువంటి గుణాలదే అలమేల్మంగ
(॥పల్లవి॥)
అటువంటి గుణాలదే అలమేల్మంగ
తటుకునఁ జిత్తగించి తగిలి మెచ్చవయ్యా
(॥॥)
కొనియాడ నేర్చిన కొమ్మ పొందుసేయ నేర్చు
ననువు గలిగినది నవ్వ నేరుచు
చెనకినది వెనకఁ జేరి మొక్క నేరుచు
వినయ మెరిఁగినది వేఁడుకొన నేర్చును
(॥॥)
గుట్టు గలిగినయది కోరి వలపించ నేర్చు
దిట్టయైనది మాట తెలుప నేర్చు
ఱట్టడి యయినది మీఱక వుండఁగ నేరుచు
చుట్ట మైనది కలయ సుసరాన నేర్చును
(॥॥)
సిగ్గు గలిగినది మచ్చిక సేవ సేయ నేర్చు
యెగ్గు పట్టనిది యిట్టే యొనయ నేర్చు
అగ్గమై శ్రీ వేంకటేశ అన్నిటా ని న్నీపె గూడె
తగ్గు మొగ్గు లేనిది దయనుండ నేర్చునూ
(||pallavi||)
aḍuvaṁṭi guṇālade alamelmaṁga
taḍugunam̐ jittagiṁchi tagili mĕchchavayyā
(||||)
kŏniyāḍa nersina kŏmma pŏṁduseya nersu
nanuvu galiginadi navva nerusu
sĕnaginadi vĕnagam̐ jeri mŏkka nerusu
vinaya mĕrim̐ginadi vem̐ḍugŏna nersunu
(||||)
guṭṭu galiginayadi kori valabiṁcha nersu
diṭṭayainadi māḍa tĕluba nersu
ṟaṭṭaḍi yayinadi mīṟaga vuṁḍam̐ga nerusu
suṭṭa mainadi kalaya susarāna nersunu
(||||)
siggu galiginadi machchiga seva seya nersu
yĕggu paṭṭanidi yiṭṭe yŏnaya nersu
aggamai śhrī veṁkaḍeśha anniḍā ni nnībĕ gūḍĕ
taggu mŏggu lenidi dayanuṁḍa nersunū