అటువలెనే వుండవలదా హరిపై భక్తియును
(॥పల్లవి॥)
అటువలెనే వుండవలదా హరిపై భక్తియును
పటువై భాగవతుల భాగ్యఫలము గానా
(॥అటు॥)
పడిపోయిన యర్థము పక్కనఁ గనినపుడు
వడిఁ బ్రాయము మగుడఁగఁ దావచ్చినయపుడు
బిడిసిన కార్యము పొందై చేకూరినయపుడు
అడరిన సంతన మింతంతనవచ్చునే మతికి
(॥అటు॥)
అట్టే దేశాంతరగతుడగు సుతుఁ గని నపుడు
నెట్టనఁ బొయ్యే ప్రాణము నిలిచినయపుడు
దట్టమై మఱచిన పద్యము దలఁపయిన యపుడు
వొట్టిన సంతస మెంతని వొనగూడును మతికి
(॥అటు॥)
అలిగిన యేలికె తనుఁగ గడు నాదరించినపుడు
చెలఁగుచు దూరపు కాంతను చేరినయపుడు
బలు శ్రీవేంకటగిరిపతి ప్రత్యక్ష మైనపుడు
నెలకొని సంతస మెంతని నిండుకుండు మతికి
(||pallavi||)
aḍuvalĕne vuṁḍavaladā haribai bhaktiyunu
paḍuvai bhāgavadula bhāgyaphalamu gānā
(||aḍu||)
paḍiboyina yardhamu pakkanam̐ ganinabuḍu
vaḍim̐ brāyamu maguḍam̐gam̐ dāvachchinayabuḍu
biḍisina kāryamu pŏṁdai segūrinayabuḍu
aḍarina saṁtana miṁtaṁtanavachchune madigi
(||aḍu||)
aṭṭe deśhāṁtaragaduḍagu sudum̐ gani nabuḍu
nĕṭṭanam̐ bŏyye prāṇamu nilisinayabuḍu
daṭṭamai maṟasina padyamu dalam̐payina yabuḍu
vŏṭṭina saṁtasa mĕṁtani vŏnagūḍunu madigi
(||aḍu||)
aligina yeligĕ tanum̐ga gaḍu nādariṁchinabuḍu
sĕlam̐gusu dūrabu kāṁtanu serinayabuḍu
balu śhrīveṁkaḍagiribadi pratyakṣha mainabuḍu
nĕlagŏni saṁtasa mĕṁtani niṁḍuguṁḍu madigi