Aduvalenaide naa yaasalu neraverunu

అటువలెనైతే నా యాసలు నెరవేరును
Language

(॥పల్లవి॥)
అటువలెనైతే నా యాసలు నెరవేరును
తటుకన మమ్మిద్దరిఁ దగఁ బెండ్లి సేయరే

(॥అటు॥)
కనువిచ్చి చూచిచూచి కాఁకలఁ బొరలరాదు
మనస్సుపెట్టి మరి మరవరాదు
తనువు సోఁకఁ జెనకి తమక మాఁపఁగరాదు
పెనఁగి యీతని నాకుఁ బెండ్లి సేయరే

(॥అటు॥)
తలపోసి తలపోసి తాలిమి గైకొనరాదు
వలపుల కొడిగట్టి వదలరాదు
సెలవుల నవ్వి కడుఁజింతలఁబొరలరాదు
పిలిచి యీతని నాకుఁ బెండ్లిసేయరే

(॥అటు॥)
చేముట్టి చేముట్టి సన్న సేసిసేసి మానరాదు
వేమారు సరసమాడి వీఁగఁగ రాదు
కామించి నన్నేలినాఁ డిక్కడ శ్రీ వేంకటేశుఁడు
ప్రేమతో నీతని నాకుఁ బెండ్లిసేయరే

(||pallavi||)
aḍuvalĕnaide nā yāsalu nĕraverunu
taḍugana mammiddarim̐ dagam̐ bĕṁḍli seyare

(||aḍu||)
kanuvichchi sūsisūsi kām̐kalam̐ bŏralarādu
manassubĕṭṭi mari maravarādu
tanuvu som̐kam̐ jĕnagi tamaga mām̐pam̐garādu
pĕnam̐gi yīdani nāgum̐ bĕṁḍli seyare

(||aḍu||)
talabosi talabosi tālimi gaigŏnarādu
valabula kŏḍigaṭṭi vadalarādu
sĕlavula navvi kaḍum̐jiṁtalam̐bŏralarādu
pilisi yīdani nāgum̐ bĕṁḍliseyare

(||aḍu||)
semuṭṭi semuṭṭi sanna sesisesi mānarādu
vemāru sarasamāḍi vīm̐gam̐ga rādu
kāmiṁchi nannelinām̐ ḍikkaḍa śhrī veṁkaḍeśhum̐ḍu
premado nīdani nāgum̐ bĕṁḍliseyare