Aduvalem joodamaa adee nokkaveduga

అటువలెఁ జూతమా అదీ నొక్కవేడుక
Language

(॥పల్లవి॥)
అటువలెఁ జూతమా అదీ నొక్కవేడుక
కుటిలకుంతలు లెంత కూరిమి గొసరేరో

(॥॥)
చిక్కించుక నీమేనఁ జెనకులు నించితేను
ఇక్కువనున్ననీసతు లేమందురో
అక్కున నాచన్నులు నీకచ్చులుగా నొత్తితేను
తెక్కులుగా నిన్ను నెంతదిసంతు లాడుదురో

(॥॥)
వన్నె నారూపులు వ్రాసి వలువ నీకుఁ గప్పితే-
నెన్నిక నీచెలులెల్లా నేమందురో
పన్నినీమోవి యెంగిలిపరచి పిప్పిసేసితే
కన్నులు జూచి వారెంత కాఁతాళింతురో

(॥॥)
చిమ్మిరేఁగఁ గూడి నీమై చెమరించఁ జేసితేను
యెమ్మెలనీకాంతలు యేమందురో
నెమ్మి శ్రీవేంకటేశుఁడ నే నలమేల్మంగను నీ
తమ్ముల మిప్పించుకొంటిఁ దామేమిసేతురో

(||pallavi||)
aḍuvalĕm̐ jūdamā adī nŏkkaveḍuga
kuḍilaguṁtalu lĕṁta kūrimi gŏsarero

(||||)
sikkiṁchuga nīmenam̐ jĕnagulu niṁchidenu
ikkuvanunnanīsadu lemaṁduro
akkuna nāsannulu nīgachchulugā nŏttidenu
tĕkkulugā ninnu nĕṁtadisaṁtu lāḍuduro

(||||)
vannĕ nārūbulu vrāsi valuva nīgum̐ gappide-
nĕnniga nīsĕlulĕllā nemaṁduro
panninīmovi yĕṁgilibarasi pippiseside
kannulu jūsi vārĕṁta kām̐tāḽiṁturo

(||||)
simmirem̐gam̐ gūḍi nīmai sĕmariṁcham̐ jesidenu
yĕmmĕlanīgāṁtalu yemaṁduro
nĕmmi śhrīveṁkaḍeśhum̐ḍa ne nalamelmaṁganu nī
tammula mippiṁchugŏṁṭim̐ dāmemiseduro