అటుచూడు సతినేర్పు లవుభళేశ
(॥పల్లవి॥)
అటుచూడు సతినేర్పు లవుభళేశ
అటమటములు గావు అవుభళేశా
(॥॥)
యెదురుఁ గొండలమీఁద నెక్కినట్టి లకిమమ్మ
అదివో నీతొడ యెక్కెనౌభాళేశ
వుదుటున నంతలోనే వురముపై నెలకొని
అదిమీఁ జన్నుల నిన్ను నౌభళేశా
(॥॥)
ముంగోపముతోడను మొక్కలీఁడవై న నిన్ను
నంగన గద్దెపై బెట్టె నౌభళేశ
కంగక వేదాద్రి నిన్ను గరుదాద్రికిఁ దీసె
అంగాలంటె నింటిలోన నౌభళేశా
(॥॥)
చేరి నీవు నవ నారసింహరూపులైతేఁ జెలి
ఆరీతుల నిన్నుఁ గూడె నౌభళేశ
గారవాన నీవు శ్రీవేంకటముపై నుండఁగాను
ఆరసి రతి మెప్పించె నౌభళేశా
(||pallavi||)
aḍusūḍu sadinerbu lavubhaḽeśha
aḍamaḍamulu gāvu avubhaḽeśhā
(||||)
yĕdurum̐ gŏṁḍalamīm̐da nĕkkinaṭṭi lagimamma
adivo nīdŏḍa yĕkkĕnaubhāḽeśha
vuduḍuna naṁtalone vuramubai nĕlagŏni
adimīm̐ jannula ninnu naubhaḽeśhā
(||||)
muṁgobamudoḍanu mŏkkalīm̐ḍavai na ninnu
naṁgana gaddĕbai bĕṭṭĕ naubhaḽeśha
kaṁgaga vedādri ninnu garudādrigim̐ dīsĕ
aṁgālaṁṭĕ niṁṭilona naubhaḽeśhā
(||||)
seri nīvu nava nārasiṁharūbulaidem̐ jĕli
ārīdula ninnum̐ gūḍĕ naubhaḽeśha
gāravāna nīvu śhrīveṁkaḍamubai nuṁḍam̐gānu
ārasi radi mĕppiṁchĕ naubhaḽeśhā