అడుగువెట్టితే నీకు ఆకె పాదమాన సుమ్మీ
(॥పల్లవి॥)
అడుగువెట్టితే నీకు ఆకె పాదమాన సుమ్మీ
నిడు(డుఁ?)జంగ నడపేల నిలవయ్య పోక
(॥॥)
సారె జాఱె మొలనూలు జడిసె ముత్తేలుపేరు
భారపుసొమ్ముతో నిన్నుఁ బట్టరాఁగాను
వూరకే యలిగిపోయే వువిదదిక్కు చూడక
నేరుచుకొంటివి నేఁడే నిలవయ్య పోక
(॥॥)
కురులు చెమటఁదోఁగె కుచయుగ మిటురానె
బెరసి నీచేయివట్టి పెనఁగఁగాను
శిరసు వంచుకొంటివి చెలియకు మొకమోడి
నెరవేరెఁ బనులెల్లా నిలవయ్య పోక
(॥॥)
పులకలు మేన నిందె భోగపుఁగళలు మించె-
నలమేలమంగ నిన్ను నలమఁగాను
యెలిమి శ్రీ వేంకటేశు యియ్యకొని కూడితివి
నెలవుల నిట్లానె నిలవయ్య పొక
(||pallavi||)
aḍuguvĕṭṭide nīgu āgĕ pādamāna summī
niḍu(ḍum̐?)jaṁga naḍabela nilavayya poga
(||||)
sārĕ jāṟĕ mŏlanūlu jaḍisĕ mutteluberu
bhārabusŏmmudo ninnum̐ baṭṭarām̐gānu
vūrage yaligiboye vuvidadikku sūḍaga
nerusugŏṁṭivi nem̐ḍe nilavayya poga
(||||)
kurulu sĕmaḍam̐dom̐gĕ kusayuga miḍurānĕ
bĕrasi nīseyivaṭṭi pĕnam̐gam̐gānu
śhirasu vaṁchugŏṁṭivi sĕliyagu mŏgamoḍi
nĕraverĕm̐ banulĕllā nilavayya poga
(||||)
pulagalu mena niṁdĕ bhogabum̐gaḽalu miṁchĕ-
nalamelamaṁga ninnu nalamam̐gānu
yĕlimi śhrī veṁkaḍeśhu yiyyagŏni kūḍidivi
nĕlavula niṭlānĕ nilavayya pŏga