అడుగు వెట్టితే నీ కాపె మీఁదాన
(॥పల్లవి॥)
అడుగు వెట్టితే నీ కాపె మీఁదాన
తొడికి కొంగు వట్టితే తోసిపోవఁ జెల్లునా
(॥అడు॥)
నిద్దిరించేవేళ వచ్చి నీవు లేపఁగాఁ జెలి
గద్దించి తిట్లు తిట్టి కసరెఁ గాక
కొద్దెరిఁగి నీ వుండితే కోపగించునా యాపె
అద్దో నీ వింతలోనె మా రలుగఁగఁ జెల్లునా
(॥అడు॥)
చదురంగ మాడేవేళ జాణతనా లాడఁగాను
తుది నిన్నుఁజేతఁ బట్టి తోసెఁ గాక
యెదుటనె వోరిచితే నింత సేసునా యాపె
కదిసి నీ విందుకుఁగాఁ గాంతాళించఁ జెల్లునా
(॥అడు॥)
పాటలు వాడేటివేళ పైకొని కాఁగిలించఁగ
తాటించి తా కొనగోరు దాఁకించెఁ గాక
యీటున శ్రీ వేంకటేశ యిందు కిట్టె కూడితివి
చీటికిమాటికి నీకు సిగ్గువడఁ జెల్లునా
(||pallavi||)
aḍugu vĕṭṭide nī kābĕ mīm̐dāna
tŏḍigi kŏṁgu vaṭṭide tosibovam̐ jĕllunā
(||aḍu||)
niddiriṁcheveḽa vachchi nīvu lebam̐gām̐ jĕli
gaddiṁchi tiṭlu tiṭṭi kasarĕm̐ gāga
kŏddĕrim̐gi nī vuṁḍide kobagiṁchunā yābĕ
addo nī viṁtalonĕ mā ralugam̐gam̐ jĕllunā
(||aḍu||)
saduraṁga māḍeveḽa jāṇadanā lāḍam̐gānu
tudi ninnum̐jedam̐ baṭṭi tosĕm̐ gāga
yĕduḍanĕ voriside niṁta sesunā yābĕ
kadisi nī viṁdugum̐gām̐ gāṁtāḽiṁcham̐ jĕllunā
(||aḍu||)
pāḍalu vāḍeḍiveḽa paigŏni kām̐giliṁcham̐ga
tāḍiṁchi tā kŏnagoru dām̐kiṁchĕm̐ gāga
yīḍuna śhrī veṁkaḍeśha yiṁdu kiṭṭĕ kūḍidivi
sīḍigimāḍigi nīgu sigguvaḍam̐ jĕllunā