Adugave yimkaanu aadanine

అడుగవే యింకాను ఆతనినే
Language

(॥పల్లవి॥)
అడుగవే యింకాను ఆతనినే
వొడివట్టే విదాతని కొడఁబాటు గాదే

(॥॥)
చిత్తము వచ్చిన సతి సేవలెల్లాఁ జేయఁగాను
పొత్తుగూడ నీవేమి కొప్పు ముడిచేవే
యిత్తల మొగమోటాన నేమీ ననకున్నాఁడింతే
తత్తరాన నాపెచేఁత యితవుగాదే

(॥॥)
కూరిమి సేయించుకొన్న కొమ్మ మాటలాడఁగాను
తూరి సందుచొచ్చేమి సుద్దులు చెప్పేవే
వీరువారు ననేరంటా నోరుచుకున్నాఁడింతే
యేరీతి నీవాడినాను యితవుగాదే

(॥॥)
యిటెప కూడివచ్చినట్టి యింతి సరసమాడఁగా
నట్టినడుమ నీవేమి నవ్వు నవ్వేవే
గట్టిగా శ్రీవేంకటేశుఁ గలసితివాతఁడు
యెట్టుయినాఁ జేకొనీఁ గాని యితవుగాదే

(||pallavi||)
aḍugave yiṁkānu ādanine
vŏḍivaṭṭe vidādani kŏḍam̐bāḍu gāde

(||||)
sittamu vachchina sadi sevalĕllām̐ jeyam̐gānu
pŏttugūḍa nīvemi kŏppu muḍiseve
yittala mŏgamoḍāna nemī nanagunnām̐ḍiṁte
tattarāna nābĕsem̐ta yidavugāde

(||||)
kūrimi seyiṁchugŏnna kŏmma māḍalāḍam̐gānu
tūri saṁdusŏchchemi suddulu sĕppeve
vīruvāru naneraṁṭā norusugunnām̐ḍiṁte
yerīdi nīvāḍinānu yidavugāde

(||||)
yiḍĕba kūḍivachchinaṭṭi yiṁti sarasamāḍam̐gā
naṭṭinaḍuma nīvemi navvu navveve
gaṭṭigā śhrīveṁkaḍeśhum̐ galasidivādam̐ḍu
yĕṭṭuyinām̐ jegŏnīm̐ gāni yidavugāde