అడుగవయ్యా వరము లాపె నేమైనా నీవు
(॥పల్లవి॥)
అడుగవయ్యా వరము లాపె నేమైనా నీవు
బడిబడి నిదివో ప్రత్యక్షమాయ నీకు
(॥అడు॥)
చెలియ పేరే నీకు సేసేజపమంత్రములు
కలసేటిసన్నలే యంగన్యాసాలు
ములువాఁడికొనగోరిమోపులే నానాముద్రలు
ఫలియించెఁ దప మాపె ప్రత్యక్షమాయ నీకు
(॥అడు॥)
ఆ పెపైఁ జల్లేవల పదే తర్పణజలము
దీపంచునవ్వు పాయసదివ్యహోమము
దాపగునీయధ రామృతమే మంచిభోజనము
నీపాలఁ బ్రత్యక్షమాయ నెలఁత యిదె నీకు
(॥అడు॥)
పొందులకాఁగిటిరతి పురశ్చరణఘలము
అంది యాపెచక్కనిరూ పది యంత్రము
యిందునె శ్రీవేంకటేశ యిటు నన్నుఁగూడితివి
అందమై ప్రత్యక్షమాయ నప్పటిఁ దానె నీకు
(||pallavi||)
aḍugavayyā varamu lābĕ nemainā nīvu
baḍibaḍi nidivo pratyakṣhamāya nīgu
(||aḍu||)
sĕliya pere nīgu sesejabamaṁtramulu
kalaseḍisannale yaṁganyāsālu
muluvām̐ḍigŏnagorimobule nānāmudralu
phaliyiṁchĕm̐ daba mābĕ pratyakṣhamāya nīgu
(||aḍu||)
ā pĕbaim̐ jallevala pade tarbaṇajalamu
dībaṁchunavvu pāyasadivyahomamu
dābagunīyadha rāmṛtame maṁchibhojanamu
nībālam̐ bratyakṣhamāya nĕlam̐ta yidĕ nīgu
(||aḍu||)
pŏṁdulagām̐giḍiradi puraśhcharaṇaghalamu
aṁdi yābĕsakkanirū padi yaṁtramu
yiṁdunĕ śhrīveṁkaḍeśha yiḍu nannum̐gūḍidivi
aṁdamai pratyakṣhamāya nappaḍim̐ dānĕ nīgu