(॥పల్లవి॥)
అడుగరే యీమాట అవునో కాదో
బడిబడి నిందరిలోఁ బచారించవలెనా
(॥ఆడు॥)
యీతల నేవిన్నవించేదేమి సారెసారెకు
అతఁడే యెరుఁగునే అన్నియును
ఘాతల నామీఁదనే కరుణఁగలఁడు తొల్లె
నీతులుగా నిఁక వేరే నేరుపఁగవలెనా
(॥ఆడు॥)
పూనివట్టి నే నిప్పుడు పొంచి యెచ్చరించేదేమి
తానే యెరుఁగునే తలఁపులెల్లా
యీనెలవులనే నన్నే యేలుకొని వున్నవాఁడు
వీనుల నే నింతేసి వివరించవలెనా
(॥ఆడు॥)
మఱవకుమని నేను మరి వేఁడుకొననేల
యెఱుఁగునే శ్రీవేంకటేశ్వరుఁడే
అఱిముఱి నన్నుఁ గూడె నలమేల్ మంగను నేను
గుఱిసేసి యింకా మఱి కొసరఁగవలెనా
(||pallavi||)
aḍugare yīmāḍa avuno kādo
baḍibaḍi niṁdarilom̐ basāriṁchavalĕnā
(||āḍu||)
yīdala nevinnaviṁchedemi sārĕsārĕgu
adam̐ḍe yĕrum̐gune anniyunu
ghādala nāmīm̐dane karuṇam̐galam̐ḍu tŏllĕ
nīdulugā nim̐ka vere nerubam̐gavalĕnā
(||āḍu||)
pūnivaṭṭi ne nippuḍu pŏṁchi yĕchchariṁchedemi
tāne yĕrum̐gune talam̐pulĕllā
yīnĕlavulane nanne yelugŏni vunnavām̐ḍu
vīnula ne niṁtesi vivariṁchavalĕnā
(||āḍu||)
maṟavagumani nenu mari vem̐ḍugŏnanela
yĕṟum̐gune śhrīveṁkaḍeśhvarum̐ḍe
aṟimuṟi nannum̐ gūḍĕ nalamel maṁganu nenu
guṟisesi yiṁkā maṟi kŏsaram̐gavalĕnā