(॥పల్లవి॥)
అడుగరే యీమాట అవునో కాదో
తడయక నావేడుక తా నెఱఁగఁడా
(॥అడు॥)
కుచ్చితము నేరను కూళతనము నేరను
యిచ్చకములాడనేర్తు నిట్టె తనకు
మచ్చికతో నప్పటి నామనసేమి సోదించేనే
తచ్చిచూచి నాగుణము తా నెఱఁగడా
(॥అడు॥)
వెక్కసాలూ నెఱఁగను వేసాలు నెఱఁగను
మొక్కనెఱుఁగుదు నేను ముందే తనకు
యిక్కడ నానేరుపులు యెంతంతని తెలిసీనే
తక్కక నేఁజేసేసేవ తా నెఱఁగఁడా
(॥అడు॥)
బలిమిఁ బెనఁగానోప పంతములాడానోప
వొలిసి కాఁగిలించఁగనోపుదుఁగాని
యెలమి శ్రీవేంకటేశుఁ డెంతసరసమాడీనే
తలకొన్న నావలపు తా నెఱఁగఁడా
(||pallavi||)
aḍugare yīmāḍa avuno kādo
taḍayaga nāveḍuga tā nĕṟam̐gam̐ḍā
(||aḍu||)
kuchchidamu neranu kūḽadanamu neranu
yichchagamulāḍanerdu niṭṭĕ tanagu
machchigado nappaḍi nāmanasemi sodiṁchene
tachchisūsi nāguṇamu tā nĕṟam̐gaḍā
(||aḍu||)
vĕkkasālū nĕṟam̐ganu vesālu nĕṟam̐ganu
mŏkkanĕṟum̐gudu nenu muṁde tanagu
yikkaḍa nānerubulu yĕṁtaṁtani tĕlisīne
takkaga nem̐jeseseva tā nĕṟam̐gam̐ḍā
(||aḍu||)
balimim̐ bĕnam̐gānoba paṁtamulāḍānoba
vŏlisi kām̐giliṁcham̐ganobudum̐gāni
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍĕṁtasarasamāḍīne
talagŏnna nāvalabu tā nĕṟam̐gam̐ḍā