Adugare yeemaada aadanini

అడుగరే యీమాట ఆతనిని
Language

(॥పల్లవి॥)
అడుగరే యీమాట ఆతనిని
తడవఁడు తాఁకఁడు తనునెట్టు నమ్మేదే

(॥అడుగ॥)
వలుపే కలిగితే వాడికెకు రావలదా
తలఁపునఁ దగిలితే తమకించఁడా
కలవుకోలైతేను కరుణించఁ దగదా
పిలిపించుకొనీఁ దాను ప్రియమెట్టు నమ్మేదే

(॥అడుగ॥)
చేతికి లోనైతేను చెప్పించుకొనునా
కాతరమే కలిగితే కై కొనఁడా
యీతల వేడుకైతే నింట నిట్టే వుండఁడా
భీతి యించుకంతా లేదు ప్రియమెట్టు నమ్మేదే

(॥అడుగ॥)
చెప్పినట్టు సేసితేను సెలవుల నవ్వునా
చిప్పిలఁ గరఁగితేను సిగ్గువడునా
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుఁగూడె
పిప్పిగా నింతగాకున్న ప్రియమెట్టు నమ్మేదే

(||pallavi||)
aḍugare yīmāḍa ādanini
taḍavam̐ḍu tām̐kam̐ḍu tanunĕṭṭu nammede

(||aḍuga||)
valube kaligide vāḍigĕgu rāvaladā
talam̐punam̐ dagilide tamagiṁcham̐ḍā
kalavugolaidenu karuṇiṁcham̐ dagadā
pilibiṁchugŏnīm̐ dānu priyamĕṭṭu nammede

(||aḍuga||)
sedigi lonaidenu sĕppiṁchugŏnunā
kādarame kaligide kai kŏnam̐ḍā
yīdala veḍugaide niṁṭa niṭṭe vuṁḍam̐ḍā
bhīdi yiṁchugaṁtā ledu priyamĕṭṭu nammede

(||aḍuga||)
sĕppinaṭṭu sesidenu sĕlavula navvunā
sippilam̐ garam̐gidenu sigguvaḍunā
yippuḍe śhrīveṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐gūḍĕ
pippigā niṁtagāgunna priyamĕṭṭu nammede