అడుగరే యీమాట ఆతని మీరందరును
(॥పల్లవి॥)
అడుగరే యీమాట ఆతని మీరందరును
యెడయని చోటను ఇగిరించుఁ బ్రియము
(॥అడు॥)
పొరపొచ్చమగుచోట పొసఁగవు మాటలు
గరిమ నొరసితేను కలఁగు మతి
సరవులు లేనిచోట చలము వెగ్గళమవును
వొరసి పెనఁగేచోట నుమ్మగిలు వలపు
(॥అడు॥)
వొలసీనొల్లనిచోట వొనరవు నగవులు
బలిమి చేసేటిచోట పంతమురాదు
అలుకలు చూపేచోట అమరదు వినయము
చలివాసివుండేచోట చండిపడుఁ బనులు
(॥అడు॥)
ననుపులేనిచోట నమ్మికచాలదు పొందు
అనుమానమైనచోట నంటదు రతి
యెనసినాఁడు శ్రీవేంకటేశుఁడు నన్నింతలోనె
తనివిలేనిచోట దైవారుఁ గోర్కులు
(||pallavi||)
aḍugare yīmāḍa ādani mīraṁdarunu
yĕḍayani soḍanu igiriṁchum̐ briyamu
(||aḍu||)
pŏrabŏchchamagusoḍa pŏsam̐gavu māḍalu
garima nŏrasidenu kalam̐gu madi
saravulu lenisoḍa salamu vĕggaḽamavunu
vŏrasi pĕnam̐gesoḍa nummagilu valabu
(||aḍu||)
vŏlasīnŏllanisoḍa vŏnaravu nagavulu
balimi seseḍisoḍa paṁtamurādu
alugalu sūbesoḍa amaradu vinayamu
salivāsivuṁḍesoḍa saṁḍibaḍum̐ banulu
(||aḍu||)
nanubulenisoḍa nammigasāladu pŏṁdu
anumānamainasoḍa naṁṭadu radi
yĕnasinām̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu nanniṁtalonĕ
tanivilenisoḍa daivārum̐ gorgulu