అడుగరే యీ సుద్ది ఆతనినే చెలులాల
(॥పల్లవి॥)
అడుగరే యీ సుద్ది ఆతనినే చెలులాల
చిడిముడిఁ జెప్పినట్టు సేసేఁ గాని
(॥॥)
కొత్త కొత్త విన్నపాలు కోరి వేఁడిఁ జేయఁగాను
చిత్త మెట్టుండునొకా చెలువునికి
బత్తి తోడ సారె సారెఁ బాదాలు విసుకఁగాను
తత్తరపు గోళ్ళేడఁదాకునో తనకు
(॥॥)
యెగ్గెఱఁగక సేవనే నిందరిలోఁ జేయఁగాను
సిగ్గులెంత నిండునొకా చేరి పతికి
వొగ్గి యే పొద్దునుఁ దనవొద్దఁ గాచుకుండఁగాను
వెగ్గళించరాక యెంత వేసటొకొ తనకు
(॥॥)
గట్టి నా గుబ్బల నొత్తి కరఁగించఁగాను పంత
మెట్టొకా శ్రీ వేంకటేశ్వరునికి
యిట్టే తా నన్నుఁగూడె యింకా నేఁగొసరఁగా
రెట్టించి తమకములు రేఁగునొకా తనకు
(||pallavi||)
aḍugare yī suddi ādanine sĕlulāla
siḍimuḍim̐ jĕppinaṭṭu sesem̐ gāni
(||||)
kŏtta kŏtta vinnabālu kori vem̐ḍim̐ jeyam̐gānu
sitta mĕṭṭuṁḍunŏgā sĕluvunigi
batti toḍa sārĕ sārĕm̐ bādālu visugam̐gānu
tattarabu goḽḽeḍam̐dāguno tanagu
(||||)
yĕggĕṟam̐gaga sevane niṁdarilom̐ jeyam̐gānu
siggulĕṁta niṁḍunŏgā seri padigi
vŏggi ye pŏddunum̐ danavŏddam̐ gāsuguṁḍam̐gānu
vĕggaḽiṁcharāga yĕṁta vesaḍŏgŏ tanagu
(||||)
gaṭṭi nā gubbala nŏtti karam̐giṁcham̐gānu paṁta
mĕṭṭŏgā śhrī veṁkaḍeśhvarunigi
yiṭṭe tā nannum̐gūḍĕ yiṁkā nem̐gŏsaram̐gā
rĕṭṭiṁchi tamagamulu rem̐gunŏgā tanagu