Adugare yakkalaala aadani meeramdarunu

అడుగరే యక్కలాల ఆతని మీరందరును
Language

(॥పల్లవి॥)
అడుగరే యక్కలాల ఆతని మీరందరును
యెడయక నన్నుఁ గావ నిదేవేళ యనవే(రే?)

(॥అడు॥)
సన్నల నే కొసరితి సరసము లాడితి
విన్నపాలెల్లాఁ జేసితి వేడుకొంటిని
తన్ను దూరరాదు నాకు దయగలవాఁడు తాను
యెన్నిటఁ గరఁగునే యిఁకఁ దనమనసు

(॥అడు॥)
చెలులచేఁ జెప్పించితి చేతులెత్తి మొక్కితి
తెలియఁజెప్పితి వావి తెలదీసితి
యెలమి నే వలచితి యింగిత మెఱుఁగు తాను
మలసి తా నెప్పుడిఁక మన్నించీనే నన్నును

(॥అడు॥)
నగితిఁ దనతో నేను నమ్మిక లిప్పించుకొంటి
తగిలి కాఁగిలించితి తమిరేఁచితి
జిగి నలమేల్మంగను శ్రీవేంకటేశుఁడు తాను
తగవుతో నన్ను నేలె తా నిఁక నేమనీనే

(||pallavi||)
aḍugare yakkalāla ādani mīraṁdarunu
yĕḍayaga nannum̐ gāva nideveḽa yanave(re?)

(||aḍu||)
sannala ne kŏsaridi sarasamu lāḍidi
vinnabālĕllām̐ jesidi veḍugŏṁṭini
tannu dūrarādu nāgu dayagalavām̐ḍu tānu
yĕnniḍam̐ garam̐gune yim̐kam̐ danamanasu

(||aḍu||)
sĕlulasem̐ jĕppiṁchidi sedulĕtti mŏkkidi
tĕliyam̐jĕppidi vāvi tĕladīsidi
yĕlami ne valasidi yiṁgida mĕṟum̐gu tānu
malasi tā nĕppuḍim̐ka manniṁchīne nannunu

(||aḍu||)
nagidim̐ danado nenu nammiga lippiṁchugŏṁṭi
tagili kām̐giliṁchidi tamirem̐sidi
jigi nalamelmaṁganu śhrīveṁkaḍeśhum̐ḍu tānu
tagavudo nannu nelĕ tā nim̐ka nemanīne