Adugare yaadanine amganalaalaa

అడుగరే యాతనినే అంగనలాలా
Language

(॥పల్లవి॥)
అడుగరే యాతనినే అంగనలాలా
గుడిగొని తానే వట్టి గొరబాయఁ గాక

(॥అడు॥)
యెదురాడేదాననా యెంతటి పనికినైనా
పదరి తానే మారు వలికీఁ గాక
తుద మీఱేదాననా దూరై యంత దిరిగినా
మదమునఁ దానే మారుమలసీఁ గాక

(॥అడు॥)
కక్కసించేదాననా కడలెంత దొక్కినాను
వెక్కసీఁడై తానే యిటు వెలసీఁ గాక
మొక్కలపు దాననా ముందు వెనకెంచితేను
పక్కనఁ దానె ముంచి పంతమాడీఁ గాక

(॥అడు॥)
తడఁబడేదాననా తనరతివేళను
బడిబడిఁ దానే చొక్కి భ్రమసీఁగాక
అడిగేటిదాననా అందరిలో నన్నుఁ గూడి
అడరి శ్రీవేంకటేశుఁడాదరించీఁ గాక

(||pallavi||)
aḍugare yādanine aṁganalālā
guḍigŏni tāne vaṭṭi gŏrabāyam̐ gāga

(||aḍu||)
yĕdurāḍedānanā yĕṁtaḍi paniginainā
padari tāne māru valigīm̐ gāga
tuda mīṟedānanā dūrai yaṁta diriginā
madamunam̐ dāne mārumalasīm̐ gāga

(||aḍu||)
kakkasiṁchedānanā kaḍalĕṁta dŏkkinānu
vĕkkasīm̐ḍai tāne yiḍu vĕlasīm̐ gāga
mŏkkalabu dānanā muṁdu vĕnagĕṁchidenu
pakkanam̐ dānĕ muṁchi paṁtamāḍīm̐ gāga

(||aḍu||)
taḍam̐baḍedānanā tanaradiveḽanu
baḍibaḍim̐ dāne sŏkki bhramasīm̐gāga
aḍigeḍidānanā aṁdarilo nannum̐ gūḍi
aḍari śhrīveṁkaḍeśhum̐ḍādariṁchīm̐ gāga