Adugare selulaara aa maamte aadani

అడుగరే చెలులార ఆ మాఁటే ఆతని
Language

(॥పల్లవి॥)
అడుగరే చెలులార ఆ మాఁటే ఆతని
విడువక పంతగాఁడై విఱ్ఱవీఁగీఁ దాను

(॥అడు॥)
నెమ్మి యమునలో నీఁదనేరిచినవాఁడు నాతో
ఇమ్ముల వలపుమడు గీఁదఁగలఁడా
దిమ్మరై అడవులెల్ల తిరిగినగోపాలుఁడు
సొమ్ములనా జవ్వనము చొరఁగలఁడా

(॥అడు॥)
బొందినే గోవర్ధనపుకొండ లెత్తినట్టివాఁడు
యిందులో నాచన్నుఁగొండ లెత్తఁగలఁడా
పందెమాడి గోపికల బడలించినట్టివాఁడు
అందపురతులు నన్ను నలఇంచఁగలఁడా

(॥అడు॥)
మించుఁబిల్లఁగోవి మోవి మెరసినవాఁడు నా-
చుంచుఁ బిల్లఁ గోవిమోవి సోఁకఁగలడా
యెంచఁగ శ్రీ వేంకటేశుఁ డింతలోవిచ్చేసి కూడె
ఇంచు భావబంధాల కీయకొనఁగలడా

(||pallavi||)
aḍugare sĕlulāra ā mām̐ṭe ādani
viḍuvaga paṁtagām̐ḍai viṭravīm̐gīm̐ dānu

(||aḍu||)
nĕmmi yamunalo nīm̐danerisinavām̐ḍu nādo
immula valabumaḍu gīm̐dam̐galam̐ḍā
dimmarai aḍavulĕlla tiriginagobālum̐ḍu
sŏmmulanā javvanamu sŏram̐galam̐ḍā

(||aḍu||)
bŏṁdine govardhanabugŏṁḍa lĕttinaṭṭivām̐ḍu
yiṁdulo nāsannum̐gŏṁḍa lĕttam̐galam̐ḍā
paṁdĕmāḍi gobigala baḍaliṁchinaṭṭivām̐ḍu
aṁdaburadulu nannu nala̮iṁcham̐galam̐ḍā

(||aḍu||)
miṁchum̐billam̐govi movi mĕrasinavām̐ḍu nā-
suṁchum̐ billam̐ govimovi som̐kam̐galaḍā
yĕṁcham̐ga śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalovichchesi kūḍĕ
iṁchu bhāvabaṁdhāla kīyagŏnam̐galaḍā