అడుగరే చెలులాల ఆతనినే యీమాఁట
(॥పల్లవి॥)
అడుగరే చెలులాల ఆతనినే యీమాఁట
తడవి నే మెవ్వ రైన తన్ను మీరేమా
(॥అడుగరే॥)
చదురంగ మాడి యాడి సరిఁ దానె వోడె నింతే
వొదిగి తనకు నసు రుసురేలే
మొదల నేఁ డెవ్వతెకు మొగము చూపి వచ్చెనో
యెదుట నున్నరా రెల్ల నేమి సేతురే
(॥అడుగరే॥)
వసంతము లాడ వచ్చి వడిఁ దానె తొప్పఁ దోఁగె
వసివాడి తానె తల వంచ నేలే
దెసల నెవ్వతెచేతి తిట్టు దాఁకి తా వచ్చెనో
యెసఁగి నవ్వేవా రెల్ల నేమి సేతురే
(॥అగుగరే॥)
సరస మాడె తనకు సరి నింద మోఁచె నింతే
దరలోన సిగ్గుపడ దన కేలె
యిర వైన శ్రీవెంకటేశుడె తా నన్నుఁ గూడె
యెరవులవా రెల్ల నేమి సేతరే
(||pallavi||)
aḍugare sĕlulāla ādanine yīmām̐ṭa
taḍavi ne mĕvva raina tannu mīremā
(||aḍugare||)
saduraṁga māḍi yāḍi sarim̐ dānĕ voḍĕ niṁte
vŏdigi tanagu nasu rusurele
mŏdala nem̐ ḍĕvvadĕgu mŏgamu sūbi vachchĕno
yĕduḍa nunnarā rĕlla nemi sedure
(||aḍugare||)
vasaṁtamu lāḍa vachchi vaḍim̐ dānĕ tŏppam̐ dom̐gĕ
vasivāḍi tānĕ tala vaṁcha nele
dĕsala nĕvvadĕsedi tiṭṭu dām̐ki tā vachchĕno
yĕsam̐gi navvevā rĕlla nemi sedure
(||agugare||)
sarasa māḍĕ tanagu sari niṁda mom̐sĕ niṁte
daralona siggubaḍa dana kelĕ
yira vaina śhrīvĕṁkaḍeśhuḍĕ tā nannum̐ gūḍĕ
yĕravulavā rĕlla nemi sedare