అడుగరే చెలులాల ఆతనినే యీమాట
(॥పల్లవి॥)
అడుగరే చెలులాల ఆతనినే యీమాట
బడి వాసి వచ్చితేను బాసగొనవలదా
(॥అడు॥)
చెలిమి వేరొకతెతోఁ జేసిన యారమణుని
సొలసినఁగాక యీసులు దీరీనా
వెలినుండి వచ్చి వట్టివినయాలు సేసేవాని
చలములు సాదించక సమ్మతయ్యీనా
(॥అడు॥)
తగ నావద్దనుం డాపెఁ దలఁసోసే మగవాని
యెగసక్కేలాడక యింపు వుట్టీనా
అగడుఁజేఁతలు సేసి యమరఁ జెప్పేవాని
నిగిడి పంగించక నెఁ జిరివి దీరునా
(॥అడు॥)
యెందునైనా భోగించి యెంగిలైవుండినవాని
అంది పన్నీటఁ గడుగ కఁకె వచ్చీనా
జెంది నాతో నా సుద్దులు చెప్పేటి శ్రీవేంకటేశు
సందడిఁ గూడి నవ్వక చవి గానవచ్చునా
(||pallavi||)
aḍugare sĕlulāla ādanine yīmāḍa
baḍi vāsi vachchidenu bāsagŏnavaladā
(||aḍu||)
sĕlimi verŏgadĕdom̐ jesina yāramaṇuni
sŏlasinam̐gāga yīsulu dīrīnā
vĕlinuṁḍi vachchi vaṭṭivinayālu sesevāni
salamulu sādiṁchaga sammadayyīnā
(||aḍu||)
taga nāvaddanuṁ ḍābĕm̐ dalam̐sose magavāni
yĕgasakkelāḍaga yiṁpu vuṭṭīnā
agaḍum̐jem̐talu sesi yamaram̐ jĕppevāni
nigiḍi paṁgiṁchaga nĕm̐ jirivi dīrunā
(||aḍu||)
yĕṁdunainā bhogiṁchi yĕṁgilaivuṁḍinavāni
aṁdi pannīḍam̐ gaḍuga kam̐kĕ vachchīnā
jĕṁdi nādo nā suddulu sĕppeḍi śhrīveṁkaḍeśhu
saṁdaḍim̐ gūḍi navvaga savi gānavachchunā