అడుగరే చెలులాల ఆతనినే యీ మాట
(॥పల్లవి॥)
అడుగరే చెలులాల ఆతనినే యీ మాట
యెడసిన విరహము యెవ్వరిదో కాని
(॥॥)
చూపుల లోపలి యాస చూచుదాఁకా వేగిరము
యేపునఁ దనకు నాపై నెట్లోకాని
ఆపైఁ జన్నులయాస అంటుదాఁకా వేగిరము
వొపిక దనకుండునో వుండదోకాని
(॥॥)
మనసు లోపలి యాస మాటాడుదాఁ కా వేగిర-
మెనలేనితనకిఁక నెట్లోకాని
తనువుమీఁదటి యాస దగ్గరుదాఁకా వేగిర-
మనుగు తనకు సమ్మతౌనో కాదో
(॥॥)
కాఁగిటి యాస రెంటెము గప్పుదాఁకా వేగిరము
యేఁగివచ్చెఁ దనకైతే నెట్లోకాని
వీఁగక శ్రీ వేంకటాద్రి విభుఁడు నన్ను మన్నించె
చేఁగవేరె వలపులు సిగ్గులేవో కాని
(||pallavi||)
aḍugare sĕlulāla ādanine yī māḍa
yĕḍasina virahamu yĕvvarido kāni
(||||)
sūbula lobali yāsa sūsudām̐kā vegiramu
yebunam̐ danagu nābai nĕṭlogāni
ābaim̐ jannulayāsa aṁṭudām̐kā vegiramu
vŏbiga danaguṁḍuno vuṁḍadogāni
(||||)
manasu lobali yāsa māḍāḍudām̐ kā vegira-
mĕnalenidanagim̐ka nĕṭlogāni
tanuvumīm̐daḍi yāsa daggarudām̐kā vegira-
manugu tanagu sammadauno kādo
(||||)
kām̐giḍi yāsa rĕṁṭĕmu gappudām̐kā vegiramu
yem̐givachchĕm̐ danagaide nĕṭlogāni
vīm̐gaga śhrī veṁkaḍādri vibhum̐ḍu nannu manniṁchĕ
sem̐gaverĕ valabulu siggulevo kāni