అడుగరే చెలులాల ఆతనినే యీ మాట
(॥పల్లవి॥)
అడుగరే చెలులాల ఆతనినే యీ మాట
వుడివోని తమకాన నుండఁబోలు తాను
(॥॥)
వేడుకగలప్పుడే వెస నవ్వు వచ్చుఁగాక
వాడి వున్నప్పుడు తలవంపులే కావా
యేడనో సతులచేత యేఁపులఁబడి రాఁబోలు
యీడ నేఁ జెనకఁగాను యిటులా నుండునా
(॥॥)
ఆసలఁ గూడినప్పుడే ఆయాలు గరఁగుఁగాక
పాసివున్నప్పుడు తడఁబాటులేకావా
బేసబెల్లివలపుల పిరివీకై రాఁబోలు
నేస నేఁ బెట్టఁగాను సిగ్గుపడి వుండునా
(॥॥)
సరసమాడినప్పుడే చవులెల్లాఁ బుట్టఁగాక
గొరబై నయప్పుడు కొరతలేకావా
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
వరుస నిందాకా నిటువలె జొక్కకుండునా
(||pallavi||)
aḍugare sĕlulāla ādanine yī māḍa
vuḍivoni tamagāna nuṁḍam̐bolu tānu
(||||)
veḍugagalappuḍe vĕsa navvu vachchum̐gāga
vāḍi vunnappuḍu talavaṁpule kāvā
yeḍano sadulaseda yem̐pulam̐baḍi rām̐bolu
yīḍa nem̐ jĕnagam̐gānu yiḍulā nuṁḍunā
(||||)
āsalam̐ gūḍinappuḍe āyālu garam̐gum̐gāga
pāsivunnappuḍu taḍam̐bāḍulegāvā
besabĕllivalabula pirivīgai rām̐bolu
nesa nem̐ bĕṭṭam̐gānu siggubaḍi vuṁḍunā
(||||)
sarasamāḍinappuḍe savulĕllām̐ buṭṭam̐gāga
gŏrabai nayappuḍu kŏradalegāvā
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
varusa niṁdāgā niḍuvalĕ jŏkkaguṁḍunā