అడుగరే చెలులాల ఆతని నీసుద్ది
(॥పల్లవి॥)
అడుగరే చెలులాల ఆతని నీసుద్ది
తడవితే నిలువెల్లఁ దడిసీఁ జెమటలు(ల?)
(॥అడుగ॥)
యెనయక తలవంచు కింతవడి నూరకుండె
కనువిచ్చి చూచితేనే కాఁక రేఁగెను
అనయము మాటాడక అట పరాకున నుండె
చెనకి నే మాటాడితే చిమిడీ వలపులు
(॥అడుగ॥)
కొలువులో పరాకున కూరిమి మరచి యుండె
చెలఁగి నే నవ్వితేనే సిగ్గు రేఁగెను
వెలుపటి విచారాన వేరే బ్రమసి యుండె
తలపించి నే మొక్కితే తమకము రేఁగెను
(॥అడుగ॥)
సేస వెట్టి వేగిరాన చేరి నివ్వెర గైయుండె
ఆసగాఁ గానుకిచ్చితే నంటుకొనెను
యీసరి శ్రీ వేంకటేశుఁ డెనసె నన్నిటాను
పోసరించి నే గీరితే పులకించె మేను
(||pallavi||)
aḍugare sĕlulāla ādani nīsuddi
taḍavide niluvĕllam̐ daḍisīm̐ jĕmaḍalu(la?)
(||aḍuga||)
yĕnayaga talavaṁchu kiṁtavaḍi nūraguṁḍĕ
kanuvichchi sūsidene kām̐ka rem̐gĕnu
anayamu māḍāḍaga aḍa parāguna nuṁḍĕ
sĕnagi ne māḍāḍide simiḍī valabulu
(||aḍuga||)
kŏluvulo parāguna kūrimi marasi yuṁḍĕ
sĕlam̐gi ne navvidene siggu rem̐gĕnu
vĕlubaḍi visārāna vere bramasi yuṁḍĕ
talabiṁchi ne mŏkkide tamagamu rem̐gĕnu
(||aḍuga||)
sesa vĕṭṭi vegirāna seri nivvĕra gaiyuṁḍĕ
āsagām̐ gānugichchide naṁṭugŏnĕnu
yīsari śhrī veṁkaḍeśhum̐ ḍĕnasĕ nanniḍānu
posariṁchi ne gīride pulagiṁchĕ menu