Adugare selulaala aadani meeru

అడుగరే చెలులాల ఆతని మీరు
Language

(॥పల్లవి॥)
అడుగరే చెలులాల ఆతని మీరు
అడరి యిందుకుఁగానే అరుదయ్యీ నాకు

(॥అడు॥)
పిలువక తొల్లె వచ్చె ప్రియుడు నేఁడై తేను
బలిమిఁ జెయివట్టినాను పరాకయ్యీని
వలరాజుకైదువుల వాఁడి వోయెనొ కాని
పలికినమాటపట్టు పండి కైవాలెనో

(॥అడు॥)
కంటానే కాఁగిలిచేఘనుఁడు నేఁజెక్కు నొక్కి
అంటినాను బైకొనక అట్టె వున్నాఁడు
జంటలైనవాపు లెల్ల సరి నుడివోయనో
రెంటాను జవ్వనములు రేఁగవో యింకాను

(॥అడు॥)
మాటలాడక తొలుతే మనసిచ్చేయాతఁడు
గాఁటానఁ బలికించఁగ కలసితిమి
యేఁట వెట్టి శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
వాఁటన మొక్కఁగఁ దానె వర మిచ్చీనో

(||pallavi||)
aḍugare sĕlulāla ādani mīru
aḍari yiṁdugum̐gāne arudayyī nāgu

(||aḍu||)
piluvaga tŏllĕ vachchĕ priyuḍu nem̐ḍai tenu
balimim̐ jĕyivaṭṭinānu parāgayyīni
valarājugaiduvula vām̐ḍi voyĕnŏ kāni
paliginamāḍabaṭṭu paṁḍi kaivālĕno

(||aḍu||)
kaṁṭāne kām̐giliseghanum̐ḍu nem̐jĕkku nŏkki
aṁṭinānu baigŏnaga aṭṭĕ vunnām̐ḍu
jaṁṭalainavābu lĕlla sari nuḍivoyano
rĕṁṭānu javvanamulu rem̐gavo yiṁkānu

(||aḍu||)
māḍalāḍaga tŏlude manasichcheyādam̐ḍu
gām̐ṭānam̐ baligiṁcham̐ga kalasidimi
yem̐ṭa vĕṭṭi śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
vām̐ṭana mŏkkam̐gam̐ dānĕ vara michchīno