Adugare selulaala aadamdu vaade

అడుగరే చెలులాల ఆతఁడు వాడే
Language

(॥పల్లవి॥)
అడుగరే చెలులాల ఆతఁడు వాడే
యెడసితే జంకింతుము యింత కోపీనా

(॥ఆగుగరే॥)
చేతికి లో నౌదాఁకా జెప్పెటి ప్రియము లింతే
ఆతలి మందెమేళాలె అదు కోపీనా
కాతరపుదాన నేను ఘనుఁ డిన్నిటాఁ దాను
యేతులు నెమ్మెలు మాని యింత కోపీనా

(॥అండుగరే॥)
చనవు గలుగుదాఁకా సరవి నడచు నింతే
వెనకపనులు మీరు వెట్ట కోపీనా
మొకతోడిదాన నేను మొక్కలపుదొర దాను
యెనసి మాతోడి జడ్డు కింత కోపీనా

(॥అడుగరే॥)
కలసిన యందాఁక కన్నుల మొక్కుట యింతే
బలుము లంతటి మీఁదిపని కోపీనా
చెలి నింతే నన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు దాను
యెలయింపులరతుల కింత కోపీనా

(||pallavi||)
aḍugare sĕlulāla ādam̐ḍu vāḍe
yĕḍaside jaṁkiṁtumu yiṁta kobīnā

(||āgugare||)
sedigi lo naudām̐kā jĕppĕḍi priyamu liṁte
ādali maṁdĕmeḽālĕ adu kobīnā
kādarabudāna nenu ghanum̐ ḍinniḍām̐ dānu
yedulu nĕmmĕlu māni yiṁta kobīnā

(||aṁḍugare||)
sanavu galugudām̐kā saravi naḍasu niṁte
vĕnagabanulu mīru vĕṭṭa kobīnā
mŏgadoḍidāna nenu mŏkkalabudŏra dānu
yĕnasi mādoḍi jaḍḍu kiṁta kobīnā

(||aḍugare||)
kalasina yaṁdām̐ka kannula mŏkkuḍa yiṁte
balumu laṁtaḍi mīm̐dibani kobīnā
sĕli niṁte nannum̐ gūḍĕ śhrīvĕṁkaḍeśhum̐ḍu dānu
yĕlayiṁpularadula kiṁta kobīnā