అడుగరే రమణుఁడు అండనిదే వున్నవాఁడు
(॥పల్లవి॥)
అడుగరే రమణుఁడు అండనిదే వున్నవాఁడు
తడపెఁ జెమట మేను తగునటవే
(॥అడుగ॥)
యేకతము చెప్పేనంటా నేటేఁటివో పలికీని
కాకుసేతురటవే కాంతలను
యీకడఁ దా మేటిదొర యిల్లాలను నేనైతి
దాకొని యిటువంటివి తగునటవే
(॥అడుగ॥)
పాదాలొత్తించుకొంటానే పచ్చిమానాలు దాఁకించీ
సోదింతురటే సిగ్గులు సుదతులను
పాదుగా ఘనుఁడు దాను పట్టిపురాణి నే నైతి
దాదాత నింత సేయఁ దగునటవే
(॥అడుగ॥)
డాసి కైదండ వట్టేనంటా గోరఁ జెనకీని
రాసి నవ్వింపింతురటే రమణులను
లాసీ శ్రీవేంకటేశుఁడు సేసతోఁ గూడితి నేను
తా సుద్దులు చెప్ప నిఁకఁ దగునటవే
(||pallavi||)
aḍugare ramaṇum̐ḍu aṁḍanide vunnavām̐ḍu
taḍabĕm̐ jĕmaḍa menu tagunaḍave
(||aḍuga||)
yegadamu sĕppenaṁṭā neḍem̐ṭivo paligīni
kāguseduraḍave kāṁtalanu
yīgaḍam̐ dā meḍidŏra yillālanu nenaidi
dāgŏni yiḍuvaṁṭivi tagunaḍave
(||aḍuga||)
pādālŏttiṁchugŏṁṭāne pachchimānālu dām̐kiṁchī
sodiṁturaḍe siggulu sudadulanu
pādugā ghanum̐ḍu dānu paṭṭiburāṇi ne naidi
dādāda niṁta seyam̐ dagunaḍave
(||aḍuga||)
ḍāsi kaidaṁḍa vaṭṭenaṁṭā goram̐ jĕnagīni
rāsi navviṁpiṁturaḍe ramaṇulanu
lāsī śhrīveṁkaḍeśhum̐ḍu sesadom̐ gūḍidi nenu
tā suddulu sĕppa nim̐kam̐ dagunaḍave