Adugare mee rayina namganalaala vibhuni

అడుగరే మీ రయిన నంగనలాల విభుని
Language

(॥పల్లవి॥)
అడుగరే మీ రయిన నంగనలాల విభుని
యెడయవు తలపోఁత లే మందునే

(॥॥)
వూరకే వుండితేను వుమ్మగిలీఁ దమకము
సారెకుఁ జెనకితే వేసట వుట్టీని
కూరిమి గొసరితేను కుప్ప వడీఁ దరితీపు
యేరీతి నుండునో చిత్త మే మందునే

(॥॥)
మొగము చూచితేను మునుకొనీ యాసలు
నగితేను పంతములు నాఁ టుకొనీని
తగిలి మాటాడితేనుఁ దాఁ కీని మర్మములు
యెగసక్కెములు నేర నే మందునే

(॥॥)
వరుసతోఁ బెనఁగితే వంతులు వాసులు రేఁగీ
సరసము లాడితేను చల మెక్కీని
యిరవై శ్రీ వేంకటేశుఁడింతలోనె నన్నుఁగూడె
యెరవు లే దిద్దరికి నే మందునే

(||pallavi||)
aḍugare mī rayina naṁganalāla vibhuni
yĕḍayavu talabom̐ta le maṁdune

(||||)
vūrage vuṁḍidenu vummagilīm̐ damagamu
sārĕgum̐ jĕnagide vesaḍa vuṭṭīni
kūrimi gŏsaridenu kuppa vaḍīm̐ daridību
yerīdi nuṁḍuno sitta me maṁdune

(||||)
mŏgamu sūsidenu munugŏnī yāsalu
nagidenu paṁtamulu nām̐ ṭugŏnīni
tagili māḍāḍidenum̐ dām̐ kīni marmamulu
yĕgasakkĕmulu nera ne maṁdune

(||||)
varusadom̐ bĕnam̐gide vaṁtulu vāsulu rem̐gī
sarasamu lāḍidenu sala mĕkkīni
yiravai śhrī veṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐gūḍĕ
yĕravu le diddarigi ne maṁdune