Adugamgaraadu ninnu nadugagumdamgaraadu

అడుగఁగరాదు నిన్ను నడుగకుండఁగరాదు
Language

(॥పల్లవి॥)
అడుగఁగరాదు నిన్ను నడుగకుండఁగరాదు
చిడుముడి తమకము చిమ్మి రేఁగీ నాకును

(॥అడు॥)
చెక్కుల చెమట లవె చెంపలవెంట గారీ
యెక్కడనుండి వచ్చేవో యెఱఁగమయ్యా
గక్కన నీ మేననుండి గందపు బేఁటులు రాళీ
చక్కఁగా నే గరిడిని సాము చేసితివయ్యా

(॥అడు॥)
ఆముకొని నీ మేన నలపులు దేరీని
యేమిపని సేసితివో యెఱఁగమయ్యా
వేమారు నీ సెలవుల వెన్నెలనవ్వు గురిసీ
దోమటి సంతోస మేడ దొరికెనయ్యా

(॥ఆడు॥)
కందువ నీ మోమునఁ గమ్మీ నివ్వెరగులు
యెందున్నదో నీ చిత్త మెఱఁగమయ్యా
అందపు శ్రీవేంకటేశ యలమేల్మంగను నేను
చెందితివి నన్ను నీ చేఁతులు గంటిమయ్యా

(||pallavi||)
aḍugam̐garādu ninnu naḍugaguṁḍam̐garādu
siḍumuḍi tamagamu simmi rem̐gī nāgunu

(||aḍu||)
sĕkkula sĕmaḍa lavĕ sĕṁpalavĕṁṭa gārī
yĕkkaḍanuṁḍi vachchevo yĕṟam̐gamayyā
gakkana nī menanuṁḍi gaṁdabu bem̐ṭulu rāḽī
sakkam̐gā ne gariḍini sāmu sesidivayyā

(||aḍu||)
āmugŏni nī mena nalabulu derīni
yemibani sesidivo yĕṟam̐gamayyā
vemāru nī sĕlavula vĕnnĕlanavvu gurisī
domaḍi saṁtosa meḍa dŏrigĕnayyā

(||āḍu||)
kaṁduva nī momunam̐ gammī nivvĕragulu
yĕṁdunnado nī sitta mĕṟam̐gamayyā
aṁdabu śhrīveṁkaḍeśha yalamelmaṁganu nenu
sĕṁdidivi nannu nī sem̐tulu gaṁṭimayyā