Adugamga siggayyee naa kamduge nemdu

అడుగఁగ సిగ్గయ్యీ నా కందుకే నేఁడు
Language

(॥పల్లవి॥)
అడుగఁగ సిగ్గయ్యీ నా కందుకే నేఁడు
చిడిముడి చేఁతల చిన్నదానఁ గనకా

(॥॥)
చిత్త మెట్టున్నదో నాపై చెలువునికి
యిత్తల నాపొందు లింక నేమి సేసీనో
బిత్తరపు రతులలో ప్రియ మేటిదో
హత్తిన వో చెలులాల అదె విచారించెనూ

(॥॥)
యెప్పుడు వచ్చునో మా యింటికిఁ దాను
చిప్పిలఁ గాంతల చేత చెప్పంపినాఁడు
దొప్పుగాఁ గరుణ నన్నుఁ జూచె నిందాఁకా
తప్పక యీ వుపమలే తలపోసీ నేనూ

(॥॥)
వోవరిలోఁ బవళించి వున్నాఁడట
కైవసమై యెంతలోనే కలసె నన్ను
సేవ నలమేల్మంగను శ్రీ వేంకటేశుఁడు తాను
భావించి నే నిందుకే పై పై మెచ్చేనూ

(||pallavi||)
aḍugam̐ga siggayyī nā kaṁduge nem̐ḍu
siḍimuḍi sem̐tala sinnadānam̐ ganagā

(||||)
sitta mĕṭṭunnado nābai sĕluvunigi
yittala nābŏṁdu liṁka nemi sesīno
bittarabu radulalo priya meḍido
hattina vo sĕlulāla adĕ visāriṁchĕnū

(||||)
yĕppuḍu vachchuno mā yiṁṭigim̐ dānu
sippilam̐ gāṁtala seda sĕppaṁpinām̐ḍu
dŏppugām̐ garuṇa nannum̐ jūsĕ niṁdām̐kā
tappaga yī vubamale talabosī nenū

(||||)
vovarilom̐ bavaḽiṁchi vunnām̐ḍaḍa
kaivasamai yĕṁtalone kalasĕ nannu
seva nalamelmaṁganu śhrī veṁkaḍeśhum̐ḍu tānu
bhāviṁchi ne niṁduge pai pai mĕchchenū