అటుగానా యేమి సేసినా యధికుల దూషింపఁగ జనదు
(॥పల్లవి॥)
అటుగానా యేమి సేసినా యధికుల దూషింపఁగ జనదు
పటుగతి వారల మహాత్మ్యంబులు పరికింపఁగా ననంతములు
(॥అటు॥)
ధరలో దుర్వాసుఁడు గోపియైన తపమునకు భంగ మనఁ దగునా
పరాశరుఁడు మత్స్యగంధిఁ గోరిన పాపమంటునా యాతనికి
అరసి వాయుజుఁడు బ్రహ్మపట్టమున కాసగించితే లాఘవమా
సరి జనకుఁడు రాజ్యఁబు చేసితే సద్గతిఁ బొందక తొలంగెనా
(॥అటు॥)
అనలుఁ డెప్పుడు సర్వభక్షకుఁడైతే నశుచిత్వము గలదా
దినకరుకిరణము హేయము లంటిన దినదీప్తికి నిగడ మగునా
వొనర చంద్రునకు కళంకు గలిగిన నుడుగక శైత్యము మానీనా
ఘనుఁడగు శేషుఁడు విషధరుఁడైతే కడుఁ బాండిత్యము దరగీనా
(॥అటు॥)
అల ప్రహ్లదుడు రాక్షస జన్మంబైనంతనె భక్తికిఁ గొదువా
కులముగల హరిశ్చంద్రుఁడంత్యజునిఁ గొలిచిన సత్యము కడ మగునా
కలహప్రియుడైనా నారదునకుఁ గలిగిన సాత్వికమునఁ గొఱతా
యెలమి శ్రీవేంకటేశుఁడు తనదాసుల యిండ్లనున్న నధికుఁడే కాఁడా
(||pallavi||)
aḍugānā yemi sesinā yadhigula dūṣhiṁpam̐ga janadu
paḍugadi vārala mahātmyaṁbulu parigiṁpam̐gā nanaṁtamulu
(||aḍu||)
dharalo durvāsum̐ḍu gobiyaina tabamunagu bhaṁga manam̐ dagunā
parāśharum̐ḍu matsyagaṁdhim̐ gorina pābamaṁṭunā yādanigi
arasi vāyujum̐ḍu brahmabaṭṭamuna kāsagiṁchide lāghavamā
sari janagum̐ḍu rājyam̐bu seside sadgadim̐ bŏṁdaga tŏlaṁgĕnā
(||aḍu||)
analum̐ ḍĕppuḍu sarvabhakṣhagum̐ḍaide naśhusitvamu galadā
dinagarugiraṇamu heyamu laṁṭina dinadīptigi nigaḍa magunā
vŏnara saṁdrunagu kaḽaṁku galigina nuḍugaga śhaityamu mānīnā
ghanum̐ḍagu śheṣhum̐ḍu viṣhadharum̐ḍaide kaḍum̐ bāṁḍityamu daragīnā
(||aḍu||)
ala prahladuḍu rākṣhasa janmaṁbainaṁtanĕ bhaktigim̐ gŏduvā
kulamugala hariśhchaṁdrum̐ḍaṁtyajunim̐ gŏlisina satyamu kaḍa magunā
kalahapriyuḍainā nāradunagum̐ galigina sātvigamunam̐ gŏṟadā
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍu tanadāsula yiṁḍlanunna nadhigum̐ḍe kām̐ḍā