Adugaana vuttamuraalainadi vojado numdu

అటుగాన వుత్తమురాలైనది వోజతో నుండు
Language

(॥పల్లవి॥)
అటుగాన వుత్తమురాలైనది వోజతో నుండు
కిటుకులాఁడైనది కిందుపడి మెలఁగు

(॥అటుగాన॥)
పొందు సేయఁగఁ జేయఁగఁ బురిగొను మోహము
మందెమేళమైతేను మనసు రోసు
ముందర నెపుడు నుంటే ముంచి ఆయాలుగరఁగు
గొందినే యలుగఁ బోతే కొనసాగ వాసలు

(॥అటుగాన॥)
మాట లాడఁగ నాడఁగ మచ్చికెలు నాటుకొను
నీటున గర్వాన నుంటే నిండదు తమ
పాటించి కొల్చితేను పైపై గరుణ వుట్టు
గాటాన సాదించితేను కడు జల మెక్కును

(॥అటుగాన॥)
సారె గూడఁగ గూడఁగ చవులు వుట్టు రతులు
చేరక సిగ్గు వడితేను చింత రేఁగును
యీరీతి శ్రీవేంకటేశ యెరిఁగి యలమేల్మంగ
కోరి నీ వుర మెక్కెను కోటిసేసు గుణము

(||pallavi||)
aḍugāna vuttamurālainadi vojado nuṁḍu
kiḍugulām̐ḍainadi kiṁdubaḍi mĕlam̐gu

(||aḍugāna||)
pŏṁdu seyam̐gam̐ jeyam̐gam̐ burigŏnu mohamu
maṁdĕmeḽamaidenu manasu rosu
muṁdara nĕbuḍu nuṁṭe muṁchi āyālugaram̐gu
gŏṁdine yalugam̐ bode kŏnasāga vāsalu

(||aḍugāna||)
māḍa lāḍam̐ga nāḍam̐ga machchigĕlu nāḍugŏnu
nīḍuna garvāna nuṁṭe niṁḍadu tama
pāḍiṁchi kŏlsidenu paibai garuṇa vuṭṭu
gāḍāna sādiṁchidenu kaḍu jala mĕkkunu

(||aḍugāna||)
sārĕ gūḍam̐ga gūḍam̐ga savulu vuṭṭu radulu
seraga siggu vaḍidenu siṁta rem̐gunu
yīrīdi śhrīveṁkaḍeśha yĕrim̐gi yalamelmaṁga
kori nī vura mĕkkĕnu koḍisesu guṇamu